హీరో విక్కీ కౌశల్, నిర్మాత రోనీ స్క్రూవాలా, దర్శకుడు ఆదిత్య ధర్… ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిందే సూపర్ హిట్ మూవీ ‘యురి : ద సర్జికల్ స్ట్రైక్’. అయితే, వీరు ముగ్గురు మరోసారి చేతులు కలపబోతున్నారు. విక్కీ కౌశల్, సారా అలీఖాన్ జంటగా దర్శకుడు ఆదిత్య ‘ద ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ రూపొందించనున్నాడు. మహాభారతంలోని గురు ద్రోణుని కుమారుడే అశ్వథ్థామ. ఇప్పటికీ ఆయన బతికే ఉన్నాడని హిందువులు నమ్ముతారు. అటువంటి వీరాధివీరుని పాత్ర ఆధారంగా ‘ద ఇమ్మోర్టల్ […]
తమిళనాడు కోయంబత్తూర్ ఆస్పత్రి ఆవరణలో పార్క్ చేసిన అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్లు పేలుడు సంభవించింది. సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో భారీగా పొగలు, మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ఆక్సిజన్ సిలిండర్లు ఎలా పేలాయన్నదానిపై ఆస్పత్రి వర్గాలు విచారణ ప్రారంభించాయి.
డీప్ ఫేక్ అంటే తెలుసా? అది కూడా ఒక రకమైన సాఫ్ట్ వేర్. కాకపోతే, దాని సాయంతో ఎంత చక్కగా ఫేక్ చేయవచ్చంటే… చూసేవారు రియల్ అనే అనుకుంటారు! మనకు నచ్చిన వీడియోలో మనం కావాలనుకున్న వారి మెడకి… ఏ తలకాయ అయినా బిగించవచ్చు! అదే చేశాడు ఓ హాలీవుడ్ మూవీ లవ్వర్…డీప్ ఫేక్ ట్రైలర్స్ ఈ మధ్య ఊపందుకున్నాయి. డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో ఓ నెటిజన్ ‘గ్లాడియేటర్ 2’ ట్రైలర్ విడుదల చేశాడు! అంతే […]
వైరస్ వ్యాప్తి ప్రమాదంతో పోలిస్తే, తల్లి తన శిశువుకు పాలు పట్టడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఇదివరకే ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనల్లో తేలిన విషయం తెలిసిందే. తాజాగా నేషనల్ నియోనాటల్ ఫోరం తెలంగాణ చాప్టర్ ప్రతినిధులు, నిలోఫర్ వైద్య నిపుణులు మరిన్ని సందేహాలకు వివరంగా సమాధానమిచ్చారు. తల్లిపాలతో శిశువులకు వైరస్ సోకదని, తల్లికి పాజిటివ్ వచ్చినా బిడ్డకు పాలు పట్టవచ్చు అన్నారు. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు పట్టాలి, కరోనా స్వల్ప లక్షణాలున్నా నేరుగా […]
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తుండగా, అలియా భట్ రాంచరణ్ పక్కన నటిస్తోంది. కాగా అలియా ఈ సినిమాతో పాటుగా పలు బాలీవుడ్ చిత్రాలతోను బిజీగా వుంది. అయితే ఈ బ్యూటీ మరోసారి రాంచరణ్ సరసన నటించనున్నట్లు సమాచారం. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, రాంచరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా […]
కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసారన్న మనస్తాపంతో భర్త గుండెపోటుతో మరణించాడు. మృతుడు దాసరి రమేష్(36) బాపులపాడు మండలం ఏ. సీతారామపురానికి చెందినవాడు. కాగా రెండ్రోజుల క్రితం రమేష్ భార్య హనుమాన్ జంక్షన్ సీఐ రమణకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. నిందితుడిపై కేసు నమోదు చేశామన్న వీరవల్లి పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకోకపోవడం వల్లనే రమేష్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఆందోళన చేశారు. రోడ్డుపై నిరసనను పోలీసులు […]
కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటం చేస్తున్న వారికి తనవంతుగా ఎంతో సాయం చేస్తున్నారు సోనూసూద్. ఇప్పటికే యు.ఎస్., ఫ్రాన్స్ నుండి ఆక్సిజన్ సిలెండర్స్ ను, వాటి తయారీ యంత్రాలను తీసుకొచ్చారు సోనూసూద్. అయితే ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేసే పనిలోనూ ఆయన బృందం నిమగ్నమై ఉంది. తాజా సమాచారం ప్రకారం సోనూసూద్ తొలి ఆక్సిజన్ ఫ్లాంట్స్ ను ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సోనూసూద్ బృందం కర్నూలు […]
కష్టాలన్నిట్లో అవమానం దారుణమైనది! పైగా అది లోలోన దాగుండి దహించేస్తుంటే మరింత నరకప్రాయంగా ఉంటుంది. అందుకే, ఆ హాలీవుడ్ నటుడు తనని ఇంత కాలం తీవ్ర మానసిక వేదనకి గురి చేసిన అంతర్మథనాన్ని ఇంతటితో అంతం చేద్దామనుకున్నాడు. 14 ఏళ్లుగా గుండెల్లో దాచుకున్న రహస్యం బయటపెట్టేశాడు. ప్రపంచం అవమానిస్తుందేమో అన్న భయం పక్కన పెట్టి తన ముందు తానైతే తల దించుకోకుండా ఉండాలని డిసైడ్ అయ్యాడు! అతనే బిల్లీ పోర్టర్…బిల్లీ పోర్టర్ ఓ అమెరికన్ నటుడు. ‘పోజ్’ […]
మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మేన్’ సీజన్ 2 ట్రైలర్ ఇలా విడుదలైందో లేదో అలా కంట్రావర్శీలకు తెర లేపింది. మొదటి సీజన్ లో కాశ్మీర్ మిలిటెంట్స్ ను బేస్ చేసుకుని కథను నడిపిన ‘ది ఫ్యామిలీ మేన్’ దర్శక నిర్మాతలు ఈ సెకండ్ సీజన్ లో తమ ఫోకస్ ను దక్షిణాది మీద పెట్టారు. మరీ ముఖ్యంగా ఎల్టీటీఈ తీవ్రవాదులను టార్గెట్ చేస్తూ ఈ సీజన్ ను నడిపారని ట్రైలర్ […]
‘ద రాక్’గా ఒకప్పుడు దుమారం రేపిన టాప్ రెస్లర్ డ్వేన్ జాన్సన్. ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే, ద రాక్ తొలిసారి వాయిస్ అందించబోతున్నాడు. అదీ ఓ యానిమెటెడ్ మూవీలో కుక్క పాత్రకి! అయితే, అది మామూలుగా డాగ్ కాదట. సూపర్ డాగ్ ‘క్రిప్టో’ అంటున్నారు!డీసీ కామిక్స్ వారి ‘లీగ్ ఆఫ్ సూపర్ పెట్స్’ మూవీకి డ్వేన్ జాన్సన్ కూడా ఒక నిర్మాత. ఆయన ‘సెవన్ బక్స్ ప్రొడక్షన్స్’తో కలసి వార్నర్ బ్రదర్స్ సంస్థ […]