పుట్టిన రోజున పెద్ద మనసు చాటుకున్న మోహన్ లాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ శుక్రవారం 61వ పుట్టిన రోజును జరుపుకున్నారు. నిజానికి అందులో పెద్ద విశేషం లేదు. కానీ ఈ యేడాది ఆయన పుట్టిన రోజును గతంలో కంటే కూడా భిన్నంగా ఓ గొప్ప మానవతామూర్తిగా జరుపుకున్నారు. ప్రస్తుతం కొవిడ్ 19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అందులో కేరళ కూడా మినహాయింపేమీ కాదు. అయితే మల్లూవుడ్ కు చెందిన ఈ మెగాస్టార్ తన పుట్టిన రోజు సందర్భంగా తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా కేరళలోని వివిధ ప్రాంతాలలో ఉన్న 13 హస్పిటల్స్ కు ఆక్సిజెన్ సౌకర్యం ఉన్న బెడ్స్ ను, వెంటిలేటర్స్ ను అందించారు. కరోనా సెకెండ్ వేవ్ పై ఫ్రంట్ లైన్ వారియర్స్ యుద్ధం చేస్తున్న నేపథ్యంలో మోహన్ లాల్ సైతం తనవంతు సాయం చేసే పని మొదలు పెట్టారు. రెండు వందలకు పైగా ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న 3 ఫోల్డ్ బెడ్స్ ను, 10 వెంటిలేటర్ సిస్టమ్ ఉన్న ఐసియు బెడ్స్ ను, పోర్టబుల్ ఎక్స్ రే మిషన్స్ ను హాస్పిటల్స్ కు అందించారు. అలానే ఓ మెడికల్ కాలేజీలోని రెండు వార్డులకు ఆక్సిజన్ పైప్ లైన్స్ ను కూడా విశ్వశాంతి ఫౌండేషన్ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సహాయాన్ని అందుకున్న వాటిలో ప్రభుత్వ, కో-ఆపరేటివ్, ప్రైవేట్ సెక్టార్ హాస్పిటల్స్ ఉన్నాయని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా కేరళ ప్రభుత్వ హెల్త్ కేర్ స్క్రీమ్ కిందకు వచ్చేవేనని చెప్పారు. ఇందు కోసం ఈ ఫౌండేషన్ 1.5 కోట్ల రూపాయలను వెచ్చించింది. రాబోయే రోజుల్లో విశ్వశాంతి ఫౌండేషన్ తన సేవలను కేరళ బయట ఉన్న హాస్పిటల్స్ కు కూడా అందచేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.
Also Read
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
- Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
- Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. 'రామాయణ' పార్ట్ 1 టైటిల్ ఇదే!
తాజావార్తలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
-
Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
-
Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
-
PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
-
Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!