సరికొత్త మార్గం చూపిన సల్మాన్ రాధే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నయా మూవీ రాధేని చూసి సగటు సినిమా ప్రేక్షకుడు సైతం పెదవి విరుస్తున్నా… ఆ మూవీ ఎలా ఉందో ఓసారి చూసేస్తే పోలా అనే భావనే అత్యధికశాతం మంది సినీ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇటు విదేశాలలో థియేటర్లలోనూ, పలు దేశాల్లో పే ఫర్ వ్యూ పద్ధతిలోనూ ఈ సినిమాను చూసే అవకాశం నిర్మాతలు కల్పించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే… ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో యాపిల్ టీవీ (ఐ ట్యూన్స్) ద్వారా లైవ్ అయిన తొలి హిందీ చిత్రంగా రాధే ఓ రికార్డ్ సృష్టించింది.
అంతేకాదు… ఈ సినిమా మీద ఎంత నెగెటివ్ టాక్ ఉన్నా… తొలిరోజున లైవ్ లో మొత్తంగా 42 లక్షల మంది రాధే చిత్రాన్ని వీక్షించారని యాపిల్ టీవీ సంస్థ ప్రకటించింది. ఆఫ్రికా, ఆసియా, యూరప్ ఖండాలలో 65కు పైగా దేశాలలో దీనిని జనం చూశారు. వీటిలో బెల్గేరియా, డెన్మార్క్, కెనడా, ఫిజీ, మలేసియా, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, మారిషస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు లభించిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలలో దీనిని ప్రసారం చేసే పనిలో పడ్డారు ఫిల్మ్ మేకర్స్. యాపిల్ టీవీతో పాటుగా రాధే కెనడాలో బెల్ ఫెబీ టీవీ, ఆప్టిక్ టీవీ; ఆఫ్రికాలోని బాక్సాఫీస్ డీఎస్ టీవీ లలో ప్రసారం అవుతోంది. అలానే జీ 5తో పాటు కరేబియన్ లోనూ ఫ్లో ఆన్ డిమాండ్ పద్ధతిలో సినిమాను చూసే ఆస్కారం కల్పిస్తున్నారు. మొత్తం మీద భారతీయ సినిమా రంగంలోనే తొలిసారి ఇన్ని రకాలుగా, ఇన్ని దేశాలలో తమ సినిమాను ప్రసారం చేసి, నిర్మాతలు డబ్బులు గడిస్తున్నారు. మరి ఈ పంథాను ఇంకెంతమంది బాలీవుడ్ నిర్మాతలు ఫాలో అవుతారో చూడాలి.
Also Read
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
- Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
- Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
- Tags
- Radhe
- Salman Khan
తాజావార్తలు
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
-
EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!