కరోనా సెకండ్ వేవ్ వల్ల దేశంలో పరిస్థితులు క్లిష్టతరమైపోయాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అంటే పద్ధతులతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రజలకు కరోనాపై అవగాహన కలిగించేందుకు, బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ పై పలు అపోహలు ఉండగా… వాటిని తొలగించేందుకు పలువురు సెలబ్రిటీలు వారు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరికొందరైతే కరోనా రాకముందే ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. తాజాగా బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ ను ను వేయించుకున్నారు. ఈ 35 ఏళ్ల బ్యూటీ తాను వ్యాక్సిన్ వేయించుకున్న పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇటీవలే సెంట్రల్ గవర్నమెంట్ 18 నుంచి 34 సంవత్సరాల వయసున్న వారికి వ్యాక్సిన్ ను నిలిపివేసింది. ప్రస్తుతం ముంబైలో లో 35 నుంచి 44 ఏళ్ల వయసున్న వారికి వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతోంది. కాగా బాలీవుడ్ లో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, హేమమాలిని, జితేంద్ర, కమల్ హాసన్, మోహన్ లాల్ వంటి ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న విషయం తెలిసిందే.