ప్రశాంత్ నీల్ ఇటు… పూరీ జగన్నాథ్ అటు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కేజీఎఫ్’ మూవీతో ఓవర్ నైట్ ఆలిండియాలో మాస్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యశ్. నిజానికి అందులో మాస్ క్యారెక్టర్ ను సైతం ఎంతో క్లాస్ గా, సెటిల్డ్ గా చేయడంతో అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. ప్రస్తుతం యశ్ ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ సినిమాలో ఉత్తరాదికి చెందిన సంజయ్ దత్, రవీనాటాండన్ వంటి వారూ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ తర్వాత యశ్ తెలుగు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మూవీలో నటించబోతున్నాడని శాండిల్ ఉడ్ లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ‘కేజీఎఫ్’ తరహాలోనే దీన్నీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తారట.
పూరి జగన్నాథ్ ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో విజయ్ దేవరకొండతో ‘లైగర్’ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత యశ్ మూవీనే సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. నిజానికి పూరి ఇటు కన్నడంలోనూ, అటు హిందీలోనూ చిత్రాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2001లోనే శివరాజ్ కుమార్ తో కన్నడలో ‘యువరాజ్’ మూవీ చేశాడు పూరి. తెలుగు ‘తమ్ముడు’కు ఇది రీమేక్. అలానే ఆ తర్వాత సంవత్సరం శివరాజ్ కుమార్ సోదరుడు పునీత్ హీరోగా ‘అప్పు’ మూవీ చేశాడు. అదే తెలుగులో ఆ తర్వాత సంవత్సరం ‘ఇడియట్’గా రీమేక్ అయ్యింది. ఇక తెలుగులో తాను తెరకెక్కించిన ‘బద్రీ’ మూవీని హిందీలో 2004లో ‘షర్త్’ పేరుతో రీమేక్ చేశాడు. సో… కాస్తంత ఆలస్యం ఆ రెండు చిత్రసీమల్లోకి పూరి రీ-ఎంట్రీ ఇస్తున్నాడంతే! ఇదిలా ఉంటే… ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ టాలీవుడ్ పై దృష్టి పెట్టడం పెద్ద చర్చకే దారితీస్తోంది. ఇప్పటికే ప్రభాస్ తో ‘సలార్’ చేస్తున్న ప్రశాంత్ నీల్ ఆ తర్వాత ఎన్టీయార్ తో మూవీ చేయబోతున్నాడు. అలానే రాబోయే రోజుల్లో మహేశ్ బాబు, రామ్ చరణ్ మూవీస్ కూడా అతను చేసే ఆస్కారం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద ప్రశాంత్ నీల్ ఇటు వస్తుంటే… పూరి అటు వెళుతున్నాడు.
Also Read
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
- Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
తాజావార్తలు
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
-
Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!