యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి, సాహో సినిమాలతో పాన్ ఇండియా సినిమా స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు. కాగా సోషల్ మీడియాలో ప్రభాస్ ఏకంగా హాలీవుడ్ సినిమా చేస్తున్నాడని ప్రచారం జరిగింది. యాక్షన్ హాలీవుడ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ ప్రభాస్ నటించనున్నట్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఈ సినిమా దర్శకుడు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ ప్రభాస్ పై వస్తున్న వార్తలు అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ అద్భుతమైన టాలెంట్ ఉన్న నటుడు కానీ తాను ప్రభాస్‌ను ఎప్పుడూ కలవలేదని మెక్‌క్వారీ స్పష్టం చేశాడు. సోషల్ మీడియా ద్వారానే ఇదంతా జరిగిందని దర్శకుడు తెలిపాడు.