బీర్ బాటిళ్లను సరఫరా చేస్తున్న జొమాటో డెలివరీ బాయ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. తమిళనాడులోని చెన్నై నగరంలో కేజీ రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానంగా కనిపించిన జొమాటో డెలివరీ బాయ్ వాహనాన్ని చెక్ చేశారు. దీంతో ఫుడ్ ఉండాల్సిన జొమాటో బాక్స్‌లో బీర్ బాటిళ్లు దర్శనమిచ్చాయి. కోడంబాక్కంకు చెందిన ప్రసన్న వెంకటేష్ గా నిందితున్ని గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సౌత్ స్టార్ దుల్కర్ సల్మాన్ మరో బాలీవుడ్ మూవీకి సిద్ధమవుతున్నాడు. గతంలో ‘కార్వాన్, ద జోయా ఫ్యాక్టర్’ వంటి సినిమాలు చేశాడు మన మల్లూ యాక్టర్. అయితే, ఇప్పుడు డైరెక్టర్ ఆర్. బాల్కీ మూవీలో కనిపించనున్నాడు. ఇప్పటి వరకూ రియలిస్టిక్ టచ్ ఉండే సెన్సిబుల్ సినిమాలు తీసిన బాల్కీ తొలిసారి థ్రిల్లర్ జానర్ ట్రై చేయబోతున్నాడట. లాక్ డౌన్ కాలంలో ఆయన ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేసినట్లు సమాచారం. తన కథకి దుల్కర్ పక్కాగా సరిపోతాడని […]
‘అమేజాన్’… ఇప్పుడు ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ఊతపదం! అంతలా మన జీవితాల్లోకి దూసుకొచ్చింది ఈ కామర్స్ దిగ్గజం. అయితే, అమేజాన్ అంటే ఏదో బుక్కులు, ఫోన్లు, కంప్యూటర్లు అమ్ముకునే వెబ్ సైట్ అనుకోటానికి వీల్లేదు. మరీ ముఖ్యంగా, అమేజాన్ ప్రైమ్ వచ్చాక చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ అమేజాన్ కస్టమర్స్ అయిపోయారు! తన ప్రైమ్ ఓటీటీతో అమేజాన్ డిజిటల్ స్ట్రీమింగ్ ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఎవరికీ ఏది కావాలంటే అది అమ్మే […]
మన సినిమా సెలబ్రిటీలకు విదేశాల్లో పురస్కారాలు, గౌరవాలు దక్కటం ఇప్పుడు కొత్తేం కాదు. ఫ్రాన్స్ లాంటి దేశాల్లో మన వారికి చాలా మందికి అత్యున్నత అవార్డులు దక్కాయి. అదే విధంగా, మైనపు బొమ్మల ప్రదర్శనశాలల్లోనూ ఇండియన్ సినీ సెలబ్స్ వ్యాక్స్ స్టాచ్యూస్ ప్రపంచాన్ని పలుకరిస్తూ ఉంటాయి. అయితే, ఇప్పుడు సంజయ్ దత్ కి కూడా యూఏఈ ప్రభుత్వం నుంచీ ప్రత్యేక గౌరవం దక్కింది. అయితే, ఇది ఏ అవార్డో, మైనపు బొమ్మ ఆవిష్కరణో కాదు….యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ […]
చిత్రపురి కాలనీలో కొవిడ్ బారినపడిన వారికి ఆత్మస్థైర్యాన్ని అందిస్తోంది కాదంబరి కిరణ్ “మనం సైతం” సేవా సంస్థ. అక్కడి కరోనా బాధితులకు ప్రతి రోజూ ఆహారం, ఆక్సీజెన్ సిలిండర్లు, ఆక్సీజెన్ కాన్సెన్ట్రేటర్, మందుల కిట్, పీపీఈ కిట్లు, మాస్క్ లు, శానిటైజర్, ఇమ్మ్యూనిటి పౌడర్, పళ్ళు, డ్రై ఫ్రూట్స్, ఆక్సీమీటర్లు, థర్మామీటర్లు, ఇంజెక్షన్లు అందిస్తున్నారు. ఉదయం నుంచే మొదలయ్యే ఈ సేవా కార్యక్రమాలు రాత్రి దాకా కొనసాగుతున్నాయి. బాధితుల అవసరాలు తెలుసుకుని, ‘మనం సైతం’ టీమ్ తక్షణమే […]
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కి బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా ఉంది. కొన్నాళ్ల క్రితం అతడ్ని తమ సినిమా నుంచీ తొలగిస్తున్నట్టు ధర్మా ప్రొడక్షన్స్ ప్రకటించింది. కరణ్ జోహర్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ నిర్మిస్తోన్న ‘దోస్తానా 2’లో కార్తీక్ కి ఛాన్స్ మిస్ అయింది. పైగా ఆ సినిమాలో కొంత భాగం యంగ్ హ్యాండ్సమ్ తో ఇప్పటికే షూట్ చేశారు కూడా. అయినా, ‘క్రియేటివి డిఫరెన్సెస్’ పేరుతో అతడ్ని తొలగించారు. ఇక ఇప్పుడు కార్తీక్ చేతిలోంచి […]
దేశంలోని మిగతా అన్నీ భాషలతో పోలిస్తే హిందీ ఛానల్స్ ఎక్కువే. న్యూస్ మాత్రమే కాదు ఎంటర్టైన్మెంట్ విభాగంలోనూ బోలెడు ఛానల్స్ ఉన్నాయి. మరి, కోట్లాది మందిని కట్టిపడేస్తోన్న సీరియల్స్ అండ్ షోస్ లో జాతీయ స్థాయిలో ఎవరు నంబర్ వన్? ఈ సంగతి ఓసారి తెలియాలంటే తాజా టీఆర్పీల లిస్ట్ చూడాల్సిందే…2021వ సంవత్సరంలోని 20వ వారం టీఆర్పీలు పరిశీలిస్తే… మరొక్కసారి ‘తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా’ సీరియల్ దే అగ్ర స్థానం! ప్రజెంట్ 20త్ వీక్ […]
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కి డాక్టర్స్ సర్జరీ చేశారు. కొన్నాళ్ల క్రితం ఆయన ఛాతిలో కొంచెం నొప్పి కారణంగా హాస్పిటల్ కి వెళ్లారు. మొదట ‘యాంజియోగ్రఫీ’ పరీక్ష నిర్వహించిన వైద్యులు హార్ట్ లో కొన్ని బ్లాకేజెస్ గుర్తించారు. అందుకే, శస్త్ర చికిత్స తప్పదనటంతో అనురాగ్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. హృద్రోగ నిపుణులు ఆయనకు ‘యాంజియోప్లాస్టీ’ సర్జరీ చేశారు. ప్రస్తుతం కశ్యప్ పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన కార్యదర్శి మీడియాకి తెలియజేశాడు. కాకపోతే, వారం రోజులు […]
అత్తాకోడలు అంటే ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటారు! ఇలా తయారైంది బయట వ్యవహారం! కానీ, చాలా ఇళ్లలో అత్తా, కోడలు హ్యాపీగా ఉంటారు. ఇంకా కొన్ని చోట్ల మంచి ఫ్రెండ్స్ లా కూడా ఉంటారు. అటువంటి సాస్, బహు జోడీనే జయా బచ్చన్, ఐశ్వర్య బచ్చన్!కొన్నాళ్ల క్రితం మీడియాలో జయా, ఐష్ మధ్య గొడవలంటూ అదే పనిగా వార్తలొచ్చాయి. కానీ, అవన్నీ అబద్ధాలని తేలిపోయేలా ఇప్పటికీ ఒకే ఇంట్లో సంతోషంగా కలసి ఉంటున్నారు అత్తా, కోడలు ఇద్దరూ! అంతే […]
కరోనా కారణంగా షూటింగ్స్ బంద్ కావడంతో చాలామంది హీరోలు వర్కౌట్స్ కు పరిమితమైపోయారు. షూటింగ్స్ బంద్ చేశారు. దాంతో రెగ్యులర్ గా చేసుకునే గడ్డాలకూ సెలవు చెప్పేశారు. ఇదే దారిలో మంచు విష్ణు సైతం నడిచాడు. గత యేడాది మార్చి నుండి గడ్డం పెంచుతూనే ఉన్నాడు. అయితే తాజాగా అతని కూతురు ఆరియానా ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి, మంచు విష్ణు క్లీన్ షేవ్ చేసేసుకున్నాడు. దీనికి తాతయ్య మోహన్ బాబును ఆరియానా జడ్జి గా పెట్టుకుంది. […]