పలు దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా జపాన్ లో మాత్రం ఫోర్త్ వేవ్ విజృంభణ మొదలైంది. ముఖ్యంగా జపాన్ ప్రధాన నగరం ఒసాకాలో కరోనా తీవ్రత నానాటికీ పెరుగుతోంది. కేవలం 90 లక్షల జనాభా ఉన్న జపాన్‌లో ఈ ఒక్క వారంలో 3849 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జపాన్‌లో సంభవిస్తోన్న కొవిడ్ మరణాలు కూడా ఒసాకా నగర ప్రజలను కలవరపెడుతున్నాయి. దేశంలో నమోదవుతున్న మొత్తం మరణాల్లో దాదాపు 25 శాతం ఆ ఒక్క నగరంలోనే సంభవిస్తున్నాయి.