ఆనందయ్య మందుపై పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. అటు జంతువులపైనా ప్రయోగాలు చేస్తున్నారు. మంగాపురంలోని యానిమల్ ల్యాబ్ లో ఈ పరిశోధనలు చేస్తున్నారు. నాలుగు దశల్లో ట్రయల్స్ నిర్వహించి, ప్రభుత్వ నివేదిక ఆధారంగా మందును సరఫరా చేస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి అన్నారు. మందు పంపిణీకి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాగా కొవిడ్ అధికంగా ఉన్న జంతువుపై కంటి మందు ప్రయోగం చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రయోగాలకు కనీసం నెల రోజులు పట్టే అవకాశం ఉందని నిపుణులు తేల్చి చెప్పారు.