కత్తితో బెదిరించి డబ్బులు వసూలు చేసిన నలుగురిని పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని గోదావరిఖని గంగా నగర్ ఏరియాలో లారీ డ్రైవర్ ను కత్తితో బెదిరించి డబ్బులు వసూలు చేసిన నలుగురిని డీసీపీ రవీందర్ అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 9 వేల నగదు, ఏటీఎం కార్డులు, కత్తి, బైక్ ను వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు చాకచక్యంగా చేధించిన వన్ టౌన్ సీఐలు రమేష్ బాబు, రాజ్ కుమార్ […]
‘మిడ్ నైట్ కౌబాయ్’ సినిమా నిర్మించినందుకుగానూ ఆస్కార్ అందుకున్న సీనియర్ హాలీవుడ్ నిర్మాత జెరోమ్ హెల్ మ్యాన్ గత బుధవారం మరణించాడు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన 92వ ఏట అమెరికాలోని మసాచూసెట్స్ రాష్ట్రంలో తుది శ్వాస విడిచాడు. ‘మిడ్ నైట్ కౌబాయ్’ సినిమాతో ఆస్కార్ పొందిన హెల్ మ్యాన్ ‘కమింగ్ హోమ్’ మూవీకి అకాడమీ నామినేషన్ పొందాడు. ఆయన బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డ్ రాలేదుగానీ… ‘కమింగ్ హోమ్’ మూడు ఆస్కార్స్ స్వంతం చేసుకుంది. తన కెరీర్ […]
దివంగత ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. అనాథ శవాలకు అంతిమ సంస్కారాలను నిర్వహించే బాధ్యతను చేపట్టింది. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా టెలీమెడిసిన్, మందుల పంపిణీ, అన్నదానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లును ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీలోని టెక్కలి, కుప్పం, పాలకొల్లు, రేపల్లె పట్టణాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రస్ట్ తెలిపింది. ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఏర్పాటుచేసిన కాల్ […]
లేడీ సూపర్ స్టార్ నయనతార నెక్ట్స్ రిలీజ్ ‘నెట్రికన్’. కొరియన్ మూవీ ‘బ్లైండ్’కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతోంది ఈ సినిమా. అయితే, నయన్ కంటి చూపులేని అమ్మాయిగా నటిస్తోన్న ఈ సినిమా ఓ థ్రిల్లర్. ఒక సీరియల్ కిల్లర్ ని ఓ అంధురాలు ఎలా పట్టుకుందనేదే స్టోరీ. గత నవంబర్ లోనే టీజర విడుదలైంది. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, ప్రస్తుత లాక్ డౌన్ కాలంలో ‘నెట్రికన్’ ఓటీటీ బాట పట్టవచ్చని అంటున్నారు. అంతే కాదు, […]
విశాల్ కి కోపం వచ్చింది. కారణం ఓ స్కూల్ టీచర్! చెన్నైలో ఉన్న పద్మశేషాద్రి బాల భవన్ (పీఎస్ బీబీ) స్కూల్ ఇప్పుడు పెద్ద దుమారానికి కేంద్రంగా మారింది. అందులోని ఓ కామర్స్ టీచర్ లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడని ఓ స్టూడెంట్ ఆరోపించింది. ఆ తరువాత అదే స్కూల్ కి చెందిన అనేక మంది పూర్వ విద్యార్థినులు కూడా రాజగోపాల్ అనే టీచర్ తమని వేధించాడని సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. మొత్తంగా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటోన్న […]
విశాఖలో వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడంతో నగరవాసులను చల్లటి గాలులు పలుకరించాయి. మూడు రోజులుగా ఎండలతో సతమతం అయిన జనానికి ఊరట కలిగించాయి. దట్టంగా కమ్ముకున్న మేఘాలతో గాలిదుమారం చెలరేగింది. రాగల మూడు రోజులు ఏపీలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉత్తరకోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల భారీ […]
గ్లామర్ గర్ల్ రాశి ఖన్నా ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన ‘థాంక్యూ’ సినిమాలో నటిస్తుంది. కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ‘థాంక్యూ’ మూవీ టీమ్ మాత్రం ఇటలీ వెళ్లి షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చింది. తాజాగా ఈ సినిమా ఇటలీ షూటింగ్ కష్టాలను బయటపెట్టింది రాశి ఖన్నా. ఆమె మాట్లాడుతూ.. కరోనా వేవ్ తాకిడి ఎక్కువ అవుతున్న వేళ ఇండియా నుండి బయటకు వెళ్లాలంటే భయం […]
తెలంగాణలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. నిబంధనలు పాటించని వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఓ పక్క వాహనాలను సీజ్ చేస్తున్న పోలీసులు.. మరోపక్క ఆకతాయిలను ఐసోలేషన్ కు తరలిస్తున్నారు. చాలా చోట్ల డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో లాక్ డౌన్ కొనసాగుతుంది. అయితే, తాజాగా నిబంధనలను విరుద్దంగా పెళ్ళికి ఎక్కువమందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సును సీజ్ చేశారు పోలీసులు.. వికారాబాద్ జిల్లాలోని కరన్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. […]
దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో ఏపీలోని గుంటూరులో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. గుంటూరులో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ. 100.06 కు చేరింది. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఇంకా పెరుగుతూ పోతుండడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.