పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా దర్శకుడు క్రిష్ ‘హరిహర వీరమల్లు’ సినిమాను రూపొందిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పవన్ కెరీర్‌లోనే భారీ సినిమా అవుతుందని ఎమ్ రత్నం అన్నారు. తాజాగా ఆయన హరిహర వీరమల్లు సినిమా ముచ్చట్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమా కథ విన్నప్పుడే బడ్జెట్ అంచనా వేశానని, ఎంత ఖర్చు అయిన తగ్గేదే లే.. అంటూ నిర్మాత చెప్పుకొచ్చారు. ఇప్పటికే సినిమా షూటింగ్ సగం వరకు పూర్తి అయ్యిందన్నారు. ఏప్రిల్ మొదటి […]
తెలుగునాట తారలకు లభించే ఆదరణ అంతా ఇంతా కాదు. ఇక మహానటులకు అయితే మరపురాని ప్రేక్షకాభిమానం లభిస్తుంది. ఓ వైపు నటనతో ఆకట్టుకుంటూనే మరోవైపు స్టార్స్ గా తెలుగునాట జైత్రయాత్ర చేసిన ఘనత యన్టీఆర్, ఏయన్నార్ దే! వారిద్దరూ బాక్సాఫీసు వద్ద ఢీ అంటే ఢీ అంటూ పోటీపడ్డారు. అలాంటి ఈ ఇద్దరు ఏకంగా 14 చిత్రాలలో కలసి నటించారు. సూపర్ స్టార్ డమ్ చూసిన ఇద్దరు మహానటులు అన్ని చిత్రాలలో కలసి నటించింది ప్రపంచంలో మరెక్కడా […]
యన్.టి.ఆర్. అన్న మూడక్షరాలు వినగానే తెలుగువారి మది పులకించిపోతుంది. రామారావుకు సంబంధించిన అనేక అంశాలు తెలుగువారికి పరమానందం పంచాయి. నిజజీవితంలో తారకరామ నామధేయుడు – తెరపై శ్రీరామునిగా మెప్పించిన నటధీరుడు. మన పురాణపురుషుల పాత్రలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియవు. రవివర్మ చిత్రాల ద్వారా తెలుసుకోగలిగాం. ఆ చిత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేసినట్టుగా నందమూరి నటన సాగింది. శ్రీరాముడు అంటే యన్టీఆర్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా ఆయన జనం మదిలో నిలిచారు. రామ పాత్రలో రామారావు అభినయం […]
టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ కౌర్ పిర్జాదా పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. హర్యానా మాజీ ముఖ్య మంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌ను త్వరలో పెళ్లిచేసుకోనుంది. వీరి ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కనున్న ఈ జంట.. కరోనా కారణంగా పెళ్లిని వాయిదా వేసుకున్నారు. కాగా జూలైలో దేశంలో కరోనా పరిస్థితులు అదుపులో వచ్చే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఆ నెలలోనే వీరి వివాహం ఉండనున్నట్టుగా తెలుస్తోంది. అయితే […]
కనిపించిన వాళ్లని కనిపించినట్టు లాఠీలతో ఇరగ్గొడుతోన్న లాఠీ గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. గ్యాంగ్ లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, కొంతకాలంగా బాలాపూర్ షాహీన్‌నగర్ లో అర్ధరాత్రి లాఠీలతో విరుచుకుపడుతోంది ఒక గ్యాంగ్. అర్ధరాత్రి వేళ రోడ్ల మీద కనిపించిన వారిని కనిపించినట్టు లాఠీలతో బాదుతోందీ ముఠా. ఇటీవల ముఠా ఆగడాలు మరీ పెచ్చుమీరిపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా నలుగురు బాలాపూర్ బిస్మిల్లా కాలనీ వాసులను పోలీసులు […]
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సెక్రటేరియట్ నుండి గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, సమీక్షించారు. వరి సేకరణ, సూపర్ స్ప్రెడర్ వర్గాలకు టీకాలు వేయడం, విత్తనాలు, ఎరువుల సరఫరా మరియు లభ్యత ఏర్పాట్లపై ఈ సమీక్ష నిర్వహించారు. త్వరలో రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించనున్నందున రాబోయే 6 రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా […]
తెలంగాణలో అమలు చేస్తున్న కఠిన లాక్‌డౌన్ నిబంధనలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. సుమారు నెల రోజుల తర్వాత తెలంగాణలో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఆసుపత్రిలో అరగంటకే బెడ్లు దొరుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు కోవిడ్ కు వచ్చే కాల్స్ కూడా పూర్తి మొత్తంలో తగ్గాయి. రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి అమల్లోకి వచ్చిన లాక్ డౌన్ కారణంగా ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రోడ్లపై రాకపోకలతో […]
ప్రస్తుతం సినిమాలను ప్రేక్షకుల కంటే ముందే రివ్యూ రైటర్లు సినిమా ఫలితాన్ని డిసైడ్ చేస్తున్నారు. ప్రేక్షకుల్లోనూ రివ్యూ చూసి సినిమాకు వెళ్లే రోజులు వచ్చాయి. కోట్లు డబ్బులు పెట్టి సినిమా తీస్తున్న కొందరు నిర్మాతలు కూడా రివ్యూస్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే’ ఇటీవల విడుదల కాగా, మిశ్రమ టాక్ వచ్చింది. అయితే, ఈ సినిమాపై ప్రముఖ విశ్లేషకుడు, రివ్యూ రైటర్ కమాల్ ఆర్ ఖాన్ రాసిన […]
ఢిల్లీలో ఓ యూట్యూబర్ అత్యుత్సాహంతో చేసిన పనికి కటకటాలపాలయ్యాడు. ఢిల్లీకి చెందిన యూట్యూబర్ గౌరవ్ శర్మ ఇటీవల తన పెంపుడు కుక్కను.. హైడ్రోజన్ బెలూన్లకు కట్టి వీడియోను తయారు చేశాడు. వాటితో కలిపి కుక్కను ఎగరవేసాడు. అది కాస్తా వైరల్‌గా మారడంతో చూసినవాళ్లంతా ఆ యూట్యూబర్‌పై విమర్శలు చేశారు. అంతేకాదు, జంతు ప్రేమికులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఆ యూట్యూబర్ పై పోలీస్ కేసు నమోదు అయింది. అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఓ వైపు […]