లేడీ సూపర్ స్టార్ నయనతార నెక్ట్స్ రిలీజ్ ‘నెట్రికన్’. కొరియన్ మూవీ ‘బ్లైండ్’కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతోంది ఈ సినిమా. అయితే, నయన్ కంటి చూపులేని అమ్మాయిగా నటిస్తోన్న ఈ సినిమా ఓ థ్రిల్లర్. ఒక సీరియల్ కిల్లర్ ని ఓ అంధురాలు ఎలా పట్టుకుందనేదే స్టోరీ. గత నవంబర్ లోనే టీజర విడుదలైంది. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, ప్రస్తుత లాక్ డౌన్ కాలంలో ‘నెట్రికన్’ ఓటీటీ బాట పట్టవచ్చని అంటున్నారు. అంతే కాదు, తాజాగా నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ ‘నెట్రికన్’ సినిమాపై ఓ ఎగ్జైటింగ్ అప్ డేట్ అందించాడు. మూవీలోని సాంగ్ ఒకటి నెటిజన్స్ ముందుకి త్వరలోనే రాబోతోంది అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ప్రకటించాడు. ‘నెట్రికన్’ సినిమాని ‘క్రాస్ పిక్చర్స్’ తో కలసి విఘ్నశ్ శివన్ స్వంత బ్యానర్ ‘రౌడీ పిక్చర్స్’ సంస్థ నిర్మిస్తోంది. అయితే, నయన్ తో మరో సినిమా కూడా రూపొందిస్తున్నాడు విఘ్నేశ్. ‘కాతవాకుల రెండు కాదల్’ పేరుతో విజయ్ సేతుపతి, నయనతార, సమంత కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కిస్తున్నాడు. అలాగే, సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నాత్తే’లోనూ లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ గా నటిస్తోంది. చూడాలి మరి, డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోన్న ‘నెట్రికన్’ ఆన్ లైన్ లో ఎలాంటి స్సందనని చూరగొంటుందో…