దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో ఏపీలోని గుంటూరులో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. గుంటూరులో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ. 100.06 కు చేరింది. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఇంకా పెరుగుతూ పోతుండడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.