నైరుతి రుతుపవనాలు జూన్ 3న కేరళ తీరాన్ని తాకనున్నట్టు వాతావారణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ మొదటి వారంలో నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని చేరుకోనున్నట్లు తెలిపింది. అయితే ఈసారి మే 31న కేరళకు రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ మొదట అంచనా వేసింది. ప్రస్తుతం జూన్ 3న కేరళను తాకుతాయని చెబుతోంది. రాగల మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు, […]
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో దర్యాప్తును ఎన్సీబీ ముమ్మరం చేసింది. గత కొద్దికాలంగా నత్త నడక నడుస్తున్న సుశాంత్ సింగ్ మరణం కేసు ఒక్కసారిగా ఊపందుకొన్నది. ఈ కేసులో కీలకంగా మారిన సిద్ధార్థ్ పితానిని ఈడీ, సీబీఐ, ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో అకస్మాత్తుగా సిద్దార్థ్‌ను అరెస్ట్ చేయడం పట్ల మరోసారి బాలీవుడ్లో కలకలం రేగుతోంది. సిద్ధార్థ్ అరెస్టు తర్వాత సుశాంత్ ఇంట్లో సహాయకులుగా పనిచేసిన నీరజ్, కేశవ్‌ను డ్రగ్స్ కేసులో […]
భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొని తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఇటీవల అన్ని పార్టీల ముఖ్యనేతలతో భేటీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈటల ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. బీజేపీలో చేరతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. ఈటల రాజేందర్ తో పాటే తెలంగాణ […]
విద్య, వైద్యం, వ్యవసాయం, న్యాయం కోసం ప్రతిరంగంలోనూ ప్రజలు రోడెక్కుతున్నారని తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలోని అన్నదాతలు రోడెక్కుతున్నారని, కొనుగోలు సెంటర్లలో వడ్లు కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతి రంగంలోనూ ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలపాల్సి వస్తోందని అన్నారు. విద్య కోసం రోడ్డెక్కాలి.. వైద్యం కోసం రోడ్డెక్కాలి.. న్యాయం కోసం రోడ్డెక్కాలి.. పండిన పంట కొనుగోలు కోసం రోడ్డెక్కాలి.. కొన్న పైసల కోసం పాట్లు పడాలి.. నెలల […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ సినిమాతో ఐదేళ్ళ కింద సంచలన విజయం సాధించిన వీరిద్దరు.. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రిపేర్లు చేయడానికి వచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తిచేసుకొనే పనిలో పడ్డారు. త్వరలోనే కొరటాల-ఎన్టీఆర్ మూవీ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాపై ఉన్న అంచనాలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్‌లో సినిమా ఉంటుందని కొరటాల గ్యారెంటీ ఇస్తున్నారు. […]
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. దేశంలోనూ కరోనా ప్రభావం తీవ్రంగానే వుంది. ఈ క్రమంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఉన్నత పాఠశాలలు, కాలేజీల్లో పాఠ్యాంశాలుగా విపత్తు, మహమ్మారి నిర్వహణను చేర్చాలని ప్రభుత్వం శనివారం నిర్ణయించింది. బీజేడీ నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం నవీన్ పట్నాయక్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఈ విషయంపై తీర్మానాన్ని ఆమోదించారు. తరచూ తుపానులు, మహమ్మారి […]
హిందీలో విజయవంతమైన ‘అంధాధున్’ కు రీమేక్‌గా తెలుగులో ‘మాస్ట్రో’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నటిస్తుండగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్‌కు జోడీగా నభా నటేష్ నటిస్తోంది. తమన్నా ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. అయితే ‘అంధాధున్’ సినిమాలోని టబు పాత్ర పోషిస్తున్న తమన్నా రీసెంట్ గా స్పందించింది. ‘అంధాధున్’ రీమేక్ చేస్తున్నానని తెలిసినప్పటి నుంచి, దాని ఒరిజినల్ చూడకూడదని నిర్ణయించుకున్నట్లు తమన్నా చెప్పింది. తెలుగులో తాను మరింత కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తున్నానని […]
దర్శకుడు, సంగీత దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి భలేగా సక్సెస్ రూటులో సాగుతున్న సమయంలో తెరకెక్కించిన చిత్రం ‘మావిచిగురు’. అప్పటికే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు ‘శుభలగ్నం’ వంటి బంపర్ హిట్ మూవీలో నటించి ఉండడంతో, ‘మావిచిగురు’ ఆరంభం నుంచీ ఓ ప్రత్యేకమైన క్రేజ్ నెలకొల్పింది. అందుకు తగ్గట్టుగానే మహిళాలోకాన్ని ఆకట్టుకొనే కథాంశంతో రూపొందిన ‘మావిచిగురు’ కూడా విజయకేతనం ఎగురవేసింది. 1996 మే 30న విడుదలైన ‘మావిచిగురు’ ప్రేక్షకులను భలేగా మెప్పించింది. భర్తంటే ప్రాణం పెట్టే కథానాయిక, తాను ఎక్కువ […]
నగుమోము నగ్మా, నగిషీల మహిమ తొలిసారి తెలుగుతెరపై వెలిగింది ‘పెద్దింటల్లుడు’ చిత్రంతో. ఈ సినిమాలోనే ముద్దుగా బొద్దుగా కనిపించిన నగ్మా వచ్చీ రాగానే తెలుగువారిని ఆకర్షించేసింది. సుమన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్ బాబు ఓ కీలక పాత్ర పోషించారు. వాణిశ్రీ మరో ముఖ్యభూమికలో అలరించారు. షమ్మీ కపూర్ ‘ప్రొఫెసర్’ చిత్రం పోలికలు ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఆ చిత్రాన్నే యన్టీఆర్ హీరోగా ‘భలే మాస్టర్’ పేరుతో తెలుగులో తెరకెక్కించారు. కాబట్టి మన తెలుగువారికి ‘పెద్దింటల్లుడు’ […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ దాదాపు టాప్ హీరోలందరి సరసన నటించింది. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఆమె.. రీసెంట్ సోషల్ మీడియాలోనూ మరో మైలురాయిని చేరుకుంది. 50 మిలియన్ల ఫాలోవర్స్ సొంతం చేసుకున్న బాలీవుడ్ ఐదో హీరోయిన్గా కత్రినా కైఫ్ నిలిచింది. ఈమె కంటే ముందు ప్రియాంక చోప్రా (63.3 మిలియన్లు), శ్రద్ధా కపూర్ (62 మిలియన్లు), దీపికా పదుకొణె (56.5 మిలియన్లు), ఆలియా భట్ (53.1 మిలియన్లు) ఉన్నారు. ఇక ఆమె సినిమాల […]