హిందీలో విజయవంతమైన ‘అంధాధున్’ కు రీమేక్‌గా తెలుగులో ‘మాస్ట్రో’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నటిస్తుండగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్‌కు జోడీగా నభా నటేష్ నటిస్తోంది. తమన్నా ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. అయితే ‘అంధాధున్’ సినిమాలోని టబు పాత్ర పోషిస్తున్న తమన్నా రీసెంట్ గా స్పందించింది. ‘అంధాధున్’ రీమేక్ చేస్తున్నానని తెలిసినప్పటి నుంచి, దాని ఒరిజినల్ చూడకూడదని నిర్ణయించుకున్నట్లు తమన్నా చెప్పింది. తెలుగులో తాను మరింత కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపింది. అందుకే దాని ఒరిజినల్ చూడకూడదని నిర్ణయించుకున్నట్లు నిర్ణయం తీసుకుంది.