బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో దర్యాప్తును ఎన్సీబీ ముమ్మరం చేసింది. గత కొద్దికాలంగా నత్త నడక నడుస్తున్న సుశాంత్ సింగ్ మరణం కేసు ఒక్కసారిగా ఊపందుకొన్నది. ఈ కేసులో కీలకంగా మారిన సిద్ధార్థ్ పితానిని ఈడీ, సీబీఐ, ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో అకస్మాత్తుగా సిద్దార్థ్‌ను అరెస్ట్ చేయడం పట్ల మరోసారి బాలీవుడ్లో కలకలం రేగుతోంది. సిద్ధార్థ్ అరెస్టు తర్వాత సుశాంత్ ఇంట్లో సహాయకులుగా పనిచేసిన నీరజ్, కేశవ్‌ను డ్రగ్స్ కేసులో భాగంగా ప్రశ్నించనున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపింది.