(జూన్ 1 డా. ప్రభాకర్ రెడ్డి జయంతి సందర్భంగా)చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానంటారు. కానీ ప్రభాకర్ రెడ్డి మాత్రం డాక్టర్ అయిన తర్వాతే యాక్టర్ అయ్యారు. అప్పటి నల్గొండ జిల్లా సూర్యాపేట తుంగతుర్తిలో 1935 జూన్ 1న జన్మించిన ప్రభాకర్ రెడ్డికి నటన, రచన అనేవి యుక్తవయసు నుండి అబ్బిన విద్యలు. దానికి తోడు చదువులోనూ మొదటి నుండి ప్రథమ స్ధానంలో ఉన్న ఆయన ఎం.బి.బి.ఎస్. చదివారు. ఓ వైపు వైద్య విద్యను అభ్యసిస్తూనే, అంతర్ […]
ప్రస్తుతం కేరెక్టర్ రోల్స్ లో కనిపిస్తోన్న భానుచందర్ ఒకప్పుడు కరాటే ఫైట్స్ తో కదం తొక్కారు. కొన్ని చిత్రాలలో హీరోగానూ అలరించారు. భానుచందర్ పూర్తి పేరు మద్దూరి వేంకటత్స సుబ్రహ్మణ్యేశ్వర భానుచందర్ ప్రసాద. ఆయన తండ్రి తెలుగులో విశేషమైన పేరు సంపాదించిన సంగీత దర్శకులు మాస్టర్ వేణు. తండ్రిలాగే ఆరంభంలో భానుచందర్ సైతం సరిగమలతో సావాసం చేశారు. పదనిసలో పయనం సాగించాలనీ ప్రయత్నించారు. గిటారిస్ట్ గా పేరు సంపాదించారు. ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులు నౌషాద్ వద్ద […]
ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతుండటంతో సినిమా షూటింగులు లేక సెలెబ్రిటీలందరు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఖాళీ సమయాల్లో ఎవరికీ నచ్చిన పని వారు చేసుకుంటూ గడిపేస్తున్నారు. తాజాగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ వంటగదిలోనూ మేటి అని చూపించుకున్నారు. తనకెంతో ఇష్టమైన రెసిపీని వండారు. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇదిలావుంటే, కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ విధిగా […]
నటి మీరా చోప్రా ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకోవడం విమర్శలకు దారితీసింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని పోస్ట్ పెట్టింది. అయితే ఆమె ఫ్రంట్ లైన్ వారియర్ కోటాలో ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలియడంతో మహారాష్ట్ర బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఇది ఫేక్ ఐడీ అని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు థానే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ […]
తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో లాక్ డౌన్ అంశంతో పాటుగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మహబూబాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేటీఆర్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేవలం నాలుగు మెడికల్ కాలేజీలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాడ్డాక కేసీఆర్ […]
పెద్దపల్లి జిల్లా రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లోని టాటా కంపెనీకి చెందిన స్టోర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నూతనంగా నిర్మాణంలో ఉన్న సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ లోని టాటా ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్ షెడ్ డౌన్ కావడంతో ఉదయం నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా కరెంట్ సప్లై కావడంతో టాటా స్టోర్స్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎలక్ట్రానిక్ […]
తెలంగాణలో లాక్‌డౌన్‌ను మరో 10 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు లాక్‌డౌన్ నుంచి వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు లాక్ డౌన్ కాలంలో మొదటి రైలు టెర్మినల్ స్టేషన్ నుంచి ఉదయం 7:00 గంటలకు బయలుదేరనుంది. చివరి రైలు ఉదయం 11:45 వరకే ఉంటుందని ప్రకటించారు. […]
ఇటీవలే నదుల్లో కొన్ని మృతదేహాలు కొట్టుకురావడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని నదిలో ఓ మృతదేహాన్ని విసిరివేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్ బలరాంపూర్ జిల్లాలోని రప్తి నదిపై ఉన్న ఓ బ్రిడ్జి వద్ద ఇద్దరు వ్యక్తులు ఓ మృతదేహంతో కనిపించారు. పీపీఈ కిట్ వేసుకున్న ఓ వ్యక్తితో పాటు మరోవ్యక్తి ఆ మృతదేహాన్ని నదిలోకి జారవిడుస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. అదే సమయంలో కారులో వెళ్తున్న కొందరు వ్యక్తులు ఈ వీడియోను […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం రాత్రి 7 గంటల దాకా కొనసాగింది. ఐదు గంటల పాటు కొనసాగిన సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఇచ్చింది. ఇక కోవిడ్ నిబంధనల సడలింపు నేపథ్యంలోనే ప్రభుత్వ పనిదినాల్లో, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ల […]
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుస అపజయాల అనంతరం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో కమర్షియల్ హిట్ కొట్టాడు. హీరో రామ్ మాస్ లుక్‌లో కనిపించగా.. నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా అలరించారు. అయితే టాలీవుడ్ ప్రేక్షకుల మాదిరే బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి కూడా ఇస్మార్ట్ శంకర్‌కి నుంచి అనూహ్య స్పందన వస్తోంది. లాక్ డౌన్ లో మన హీరోల డబ్బింగ్ సినిమాలకు బాలీవుడ్ లోనూ వ్యూవ్స్ మిలియన్ల సంఖ్యలో వస్తున్నాయి. తాజాగా […]