ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతుండటంతో సినిమా షూటింగులు లేక సెలెబ్రిటీలందరు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఖాళీ సమయాల్లో ఎవరికీ నచ్చిన పని వారు చేసుకుంటూ గడిపేస్తున్నారు. తాజాగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ వంటగదిలోనూ మేటి అని చూపించుకున్నారు. తనకెంతో ఇష్టమైన రెసిపీని వండారు. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇదిలావుంటే, కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ విధిగా సహకరించాలని కీర్తి సురేష్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటిస్తుంది.