నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో పూర్ణ నటిస్తోంది. ఈ సినిమా తర్వాత క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమాను చేయనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ను ఫైనల్ చేసే పనిలో పడింది చిత్రబృందం. త్రిష, శ్రుతిహాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. త్రిష ఇదివరకే బాలకృష్ణతో కలిసి ‘లయన్’ సినిమాలో నటించింది. ఇక శ్రుతిహాసన్, గోపిచంద్ మలినేనికి లక్కీ హీరోయిన్‌గా మారింది. ఆమెతో చేసిన ‘బలుపు, క్రాక్’ రెండూ మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో గోపీచంద్ మరోసారి శృతి హాసన్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నారట. మొదటినుంచి ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారనే ప్రచారం జరుగగా, ఫైనల్ గా శ్రుతిహాసన్‌ను ఖరారు చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది.