తమిళ్ స్టార్ హీరో అజిత్ కు బాంబు బెదిరింపు రావడం కోలీవుడ్ లో కలకలం రేపింది. ఆయన ఇంటిలో బాంబు పెట్టినట్టుగా గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అజిత్ ఇంటికెళ్ళి జాగిలాలతో తనిఖీలు చేశారు. ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వినోద్ తో ‘వాలిమై’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో హుమా ఖురేషి కథానాయికగా నటిస్తూ ఉండగా, కార్తికేయ విలన్ గా కనిపించనున్నాడు.