తెలంగాణలో నేటి నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్ ఆన్లైన్ తరగతులు లాక్ డౌన్ పొడిగింపుతో వాయిదా పడ్డాయి. మరోవైపు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ పేర్కొన్నారు. రేపటి నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. www.tsbie.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించారు. ఆన్‌లైన్ తరగతుల ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామని జలీల్ తెలిపారు.