కన్నడ సీనియర్ స్టార్ హీరో ఉపేంద్ర టాలీవుడ్ సినిమాలో విలన్ పాత్రలోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో దేవరాజ్ పాత్రలో మెప్పించిన ఉపేంద్ర, ప్రస్తుతం ‘గని’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. అయితే తాజాగా ఆయన అక్కినేని అఖిల్ కొత్త సినిమాలో నటించనున్నట్లు సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ‘ఏజెంట్’ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం ఉపేంద్రను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ డిఫరెంట్ లుక్ కనిపించనున్నాడు. కరోనా ప్రభావం తగ్గగానే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. ఇక అఖిల్ నటించిన తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కరోనా వేవ్ పూర్తిస్థాయిలో తగ్గక థియేటర్లలోకి రానుంది.