బాలీవుడ్ బాద్షా… కింగ్ ఖాన్… ఇలాంటి టైటిల్స్ షారుఖ్ కి ఊరికే రాలేదు. వాటి వెనుక ఎంతో శ్రమ, అదృష్టం, బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి! అందుకే, ఎస్ఆర్కే తో సినిమా అంటే సీనియర్ బ్యూటీస్ మొదలు ఈ తరం న్యూ బేబీస్ వరకూ అందరూ రెడీ అనేస్తారు. కింగ్ ఆఫ్ రొమాన్స్ అనిపించుకున్న షారుఖ్ బాలీవుడ్ హీరోయిన్స్ కి హాట్ ఫేవరెట్! అయితే, ఇదంతా నిజమే అయినా ‘ఆ నలుగురు’ కథానాయికలు మాత్రం ‘సారీ, ఎస్ఆర్కే!’ అనేశారు! ఇంత వరకూ బాలీవుడ్ బాద్షాతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయలేదు…
సోనమ్ కపూర్ తన ఏజ్ కారణంగా షారుఖ్ తో కలసి నటించలేదు. తమ ఇద్దరి మధ్యా గ్యాప్ ఎక్కువగా ఉండటంతో స్క్రీన్ మీద రొమాన్స్ పండదని ఆమె అభిప్రాయపడింది. అయితే, ట్విస్ట్ ఏంటంటే… షారుఖ్ తో దాదాపు ఈక్వెల్ ఏజ్ ఉండే సల్మాన్ తో మాత్రం సోనమ్ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమా చేసింది! కింగ్ ఖాన్ ని మాత్రమే బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టిందో మిసెస్ అహుజాకే తెలియాలి!
అమీషా పటేల్ కి ఇప్పుడంటే బీ-టౌన్ లో పెద్దగా క్రేజ్ లేదుగానీ ఒకప్పుడు ఆమె మంచి దూకుడు ప్రదర్శించేది. అప్పుడే బాద్షాతో సినిమా అంటే అమీషా వద్దనేసింది. తమ ఇద్దరి మధ్యా కెమిస్ట్రి కుదరదని ఫీలైంది. ఒకవేళ నటిస్తే వారిద్దరి మూవీ ఏమయ్యేదోగానీ… అమీషా క్రేజ్ క్రేజ్ క్రమక్రమంగా క్షీణించటం మాత్రం ఆగలేదు!
షారుఖ్ కంటే సూపర్ సీనియర్ అయిన హేమా మాలినీ కూడా ‘పఠాన్’ స్టార్ కి నో చెప్పింది. పైగా హేమా మొహమాటం లేకుండా షారుఖ్ ‘ఓవర్ యాక్టింగ్’ చేస్తాడని అనేసింది! అంత మాట అన్నాక వాళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా సాధ్యమా చెప్పండి? ఇప్పటికీ వర్కవుట్ కాలేదు…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా సైతం షారుఖ్ తో వీలుకాదని చెప్పేసింది. కింగ్ ఖాన్ తో మన ‘క్వీన్’ సినిమా చేయపోవటానికి కారణం, పర్సనల్ గా ఏమీ లేదు. నేను ఎస్ఆర్కే ఫ్యాన్ అని కూడా ఒప్పుకునే కంగనా ఆయన దారి, తన దారి వేరంటుంది. ఆ మాటకొస్తే షారుఖ్, సల్మాన్, ఆమీర్… ముగ్గురు ఖాన్స్ తోనూ వర్క్ చేయనంటుంది కంగనా! ఎందుకంటే, తాను తన కెరీర్ లో సాధించింది కాకుండా బాలీవుడ్ ఖాన్స్ సినిమాల్లో నటిస్తే కొత్తగా వచ్చేది ఏదీ లేదంటుంది ‘తలైవి’. స్టార్ హీరోల పక్కన ఊరికే గ్లామర్ షో చేస్తూ, పాటల్లో డ్యాన్సులు చేయటానికి కంగనా ఎప్పుడూ వ్యతిరేకమే!