‘మా’లో మొదలైన లొల్లి; ఎన్నికల బరిలో లేనన్న కళ్యాణ్ రామ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంతవరకూ ఏదీ రాలేదు. అయితే అది ఏ రోజైనా రావచ్చుననే అంతా భావిస్తున్నారు. ‘ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వార్మ్’ అన్నట్టుగా విలక్షణ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ ను ప్రకటించేశారు. మరో వైపు మంచు విష్ణు తన తండ్రిని తోడ్కొని సినిమా పెద్దల్ని కలిసి వస్తున్నారు. అయితే ఇవాళ తన ప్యానల్ తరఫున నిలబడబోయే వారి పేర్లను ప్రకటించిన ప్రకాశ్ రాజ్ ఎవరు ఏ పదవికి పోటీ చేస్తారో మాత్రం చెప్పలేదు. బహుశా మిగిలిన ప్యానెల్స్ లో ఎవరెవరు ఏ యే పదవికి పోటీ పడతారో తెలుసుకుని ఆ తర్వాత ప్రకాశ్ రాజ్ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే.. ఇక్కడ ఇంకో తిరకాసు ఉంది. ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్ నుండి 27 మంది పేర్లను ప్రకటించారు.
అంతేకాదు… మరికొందరు సినీ ప్రముఖులూ తన ప్యానెల్ నుండి పోటీ చేస్తారని అన్నారు. నిజానికి ‘మా’ కార్యవర్గంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తో కలిపి ఉండేది కేవలం 24 మంది మాత్రమే. సో… ప్రకాశ్ రాజ్ జాబితాలో ఉన్న అందరూ పోటీ చేసే ఆస్కారం లేదు. అందులో కొందరు తప్పుకోవాల్సింది.
ఇదిలా ఉంటే… ‘మా’ ఎన్నికల బరిలో ఇప్పటి వరకూ అనుకుంటున్న నాలుగు ప్యానెల్స్ లో రకరకాల వ్యక్తుల పేర్లు వినిపిస్తున్నాయి. అలా నందమూరి కళ్యాణ్ రామ్ సైతం ‘మా’ ఎన్నికల్లో నిలబడతారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆయన అధికార ప్రతినిధి ఫుల్ స్టాప్ పెట్టారు. సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లను నమ్మవద్దని నందమూరి కళ్యాణ్ రామ్ ‘మా’ ఎన్నికల్లో నిలబడటం లేదని స్పష్టం చేశారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజావార్తలు
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!