ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన నటి నివేదా పేతురాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్ లో బొద్దింక ఉండడంతో సదరు ఫుడ్ డెలీవరి రెస్టారెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ప్రముఖ రెస్టారెంట్ నిన్న (బుధవారం) సాయంత్రం నివేదా పేతురాజ్ ఫ్రైడ్ రైస్‌ను ఆర్డర్ చేసింది. ఫుడ్ డెలీవరి అయిన అనంతరం ప్యాక్ ఓపెన్ చేయగానే అందులో ఆమెకు చచ్చిన బొద్దింక కనిపించింది. దీంతో నివేదా పేతురాజ్, రెస్టారెంట్‌ని ట్యాగ్ చేస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. ‘ఇటీవల కాలంలో హోటళ్లు సరిగ్గా పరిశుభ్రతను పాటించడం లేదు అనడానికి ఇదొక ఉదాహరణ. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే ఇలాంటి రెస్టారెంట్లకు భారీ జరిమానా వడ్డించాలని’ ఆమె డిమాండ్ చేశారు.