ఇటీవల ‘పిట్ల కథలు’ ఆంథాలజీలో మెరిసిన ఈషారెబ్బ ప్రస్తుతం తెలుగులో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీలో మాత్రం నటిస్తోంది. అయితే ఈ అందాల చిన్నది ఇప్పుడు సరిహద్దులు దాటి తమిళ, మలయాళ చిత్రాలపై కన్నేసింది. నిజానికి ‘అంతకు ముందు ఆ తర్వాత’ మూవీ తర్వాత ‘అమీ తుమీ’ ‘అ’, ‘అరవింద సమేత’ చిత్రాలు మాత్రమే ఇషారెబ్బా కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. చిత్రంగా ఈ సినిమాల పేర్లన్నీ ‘అ’తోనే మొదలు కావడం ఓ విశేషం. ఇంతకూ విషయం ఏమంటే… ఇషా రెబ్బ చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్ గా ఉంటోంది. పైగా ఫోటో షూట్స్ తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇంకో ముచ్చట ఏమంటే… ఒకేసారి ఫోటో షూట్ చేసేసి, అందులోని ఫోటోలనే కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ పెట్టి రెచ్చగొడుతోంది. మొన్న జూన్ 2న కొన్ని గ్లామర్ స్టిల్స్ దిగిన ఇషారెబ్బ వాటిని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అదే డ్రస్ లో కళ్లజోడు పెట్టుకుని మరికొన్ని ఫోటోలు కూడా అప్పుడే దిగింది. అయితే వాటిని బుధవారం పోస్ట్ చేసింది. మొత్తం మీద ఇలా అమ్మడు ఆరగారగా అందాలను ఆరబోస్తుంటే… కుర్రాళ్ళు ఆమెకు హాట్ బ్యూటీ అనే ట్యాగ్ లైన్ తగిలించేస్తున్నారు.