బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తన 36వ జన్మదినం ఘనంగా జరుపుకున్నాడు. ముంబైలోని ఓ స్టార్ హోటల్లో ఆయన బీ-టౌన్స్ స్టార్స్ కి బర్త్ డే పార్టీ ఇచ్చాడు. రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, ఆలియా భట్ లాంటి బిగ్ సెలబ్రిటీస్ హాజరయ్యారు. వారితో బాటూ అర్జున్ కపూర్ చెల్లెళ్లు జాన్వీ, ఖుషీ కపూర్ కూడా అన్నయ్య పుట్టిన రోజు వేడుకలో సందడి చేశారు. ఇక ‘లైగర్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మన విజయ్ దేవరకొండ కూడా అర్జున్ కపూర్ బర్త్ డే బ్యాష్ కు అటెండ్ అవుతూ పాపారాజీ కెమెరాలకు చిక్కాడు!
బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ తో పాటూ దర్శకనిర్మాత కరణ్ జోహర్, అర్జున్ కపూర్ స్వంత చెల్లెల్లు అన్షులా కపూర్ కూడా బర్త్ డే పార్టీకి గ్రాండ్ గా వచ్చారు. 1985, జూలై 26న జన్మించిన అర్జున్ కపూర్ బాలీవుడ్ నిర్మాత, శ్రీదేవి భర్త అయిన బోనీ కపూర్ వారసుడు. ఆయన తల్లి బోనీ కపూర్ మొదటి భార్య దివంగత మోనా కపూర్. 36 ఏళ్ల అర్జున్ ఈ మధ్యే ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ చిత్రంలో కనిపించాడు. నెక్ట్స్ హారర్ మూవీ ‘భూత్ పోలీస్’లో సైఫ్ అలీఖాన్, జాక్విలిన్, యమీ గౌతమ్ లతో పాటూ కనిపించనున్నాడు.