టీఎంసీ ఎంపీ, నటి మిమి చక్రవర్తి కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నమ్మించి దేవాంజన్ దేవ్ అనే వ్యక్తి మిమి చక్రవర్తిని ఓ టీకా కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే, ప్రజలకు టీకాపై ఉన్న అనుమానాలు తొలగించేందుకు ఆమె కూడా టీకా వేయించుకున్నారు. ఆతర్వాత ఆమె డీహైడ్రేషన్ కు గురైంది.. బీపీ కూడా పడిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆవెంటనే కడుపునొప్పి కూడా రావడంతో ఆమె అనారోగ్యానికి టీకానే కారణమని భావించారు. అయితే, టీకా వేయించుకున్నప్పటికీ ఎస్సెమ్మెస్ రాకపోవడంతో అనుమానించిన ఎంపీ మిమి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తులో అది నకిలీ కార్యక్రమం అని తేలింది. దీంతో దేవాంజన్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. కాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నకిలీ టీకా కార్యక్రమాన్ని తీవ్రంగా పరిగణించారు. దీంతో సంబంధం ఉన్నవారందరిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.