గాజువాకలో కరాటే చాంపియన్ షిప్ కార్యక్రమంలో పాల్గున్న సినీ హీరో సుమన్ మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ ఎన్నికల పై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘మా ఎన్నికలలో ఎవరైన పోటీ చేయవచ్చు.. స్థానిక లేక స్థానికేతర అనడం కరెక్ట్ కాదు.. అవకాశం వచ్చినప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఎక్కడైన కలిసి నటిస్తున్నాం.. అప్పుడు లేని స్థానిక అనే సమస్య ఇప్పుడు మాట్లాడటం సరికాదు.. ఎంతోమంది సీనియర్ ఆర్టీస్టులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.. బ్రతుకు తెరువు లేక ఇబ్బంది పడుతున్న జూనీయర్ , సీనియర్ ఆర్టిస్టులకు ఓల్డేజ్ హోమ్ ను ఏర్పాటు చేయ్యాలి.. ప్రస్తుతం సుగర్, బీపీ మందులు కొనుక్కునే స్థోమత లేని ఆర్టిస్టులు వున్నారు. అలాగే కోవిడ్ వలన చేతిలో పని లేక చాలా మంది ఆర్ధికంగా సతమతమవుతున్నారు. వాళ్ళను ఆదుకునే ప్రయత్నం మా ఎన్నికలలో గెల్చిన వారు చేయ్యాలి. మూవీ ఆర్టీస్ట్ అసోసీయేషన్ ఎన్నికలో గెలిచినవారు మా అభివృద్ధికి కృషి చేయ్యాలి’ అని సుమన్ కోరారు.