బలవంతంగా డబ్బులు వసూలు చేసేందుకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ట్రాన్స్‌జెండర్లను సిపి సజ్జనార్ గట్టిగా హెచ్చరించారు. ఇటీవల కాలంలో ట్రాన్స్‌జెండర్లపై ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. శుభకార్యాల పేరుతో ఇళ్లపై పడి యజమానులను వేధించడం సరికాదని, ఇలాంటి బలవంతపు వసూళ్లను సహించమని ఆయన తేల్చి చెప్పారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎంతటివారినైనా జైలుకు పంపిస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా, మీపై నమోదయ్యే కేసులు మీ భవిష్యత్తును నాశనం చేస్తాయని గుర్తించుకోవాలని, అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే శిక్షలు తప్పవని స్పష్టం చేశారు.
భారత మార్కెట్లో BMW 5 సిరీస్.. కొత్త ఫీచర్ల అదుర్స్!
ఈ సందర్భంగా, హైదరాబాద్ అమీర్‌పేట్ సెల్స్ ఆడిటోరియంలో 250 మందికి పైగా ట్రాన్స్‌జెండర్లతో పోలీసులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సిపి సజ్జనార్ ట్రాన్స్‌జెండర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ట్రాన్స్‌జెండర్ల మధ్య ఉన్న గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు కారణంగా తరచుగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని, దీనివల్ల ప్రాణ నష్టం కూడా జరుగుతోందని సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం త్వరలోనే ఒక సమగ్రమైన విధానాన్ని (పాలసీ) తీసుకురానుందని ఆయన తెలియజేశారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ట్రాన్స్‌జెండర్లకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
Mamata Banerjee Apology: మెస్సీ టూర్లో గందరగోళం.. క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ