హాలీవుడ్ ను కాపీ కొట్టడంలో బాలీవుడ్ కు ఎన్ని రోజులైనా తనవి తీరదు. సినిమాల విషయంలోనే కాదు స్టైల్స్ సంగతి కూడా అంతే! రణవీర్ తాజా ఇన్ స్టాగ్రామ్ పిక్స్ అదే విషయాన్ని ఋజువు చేస్తాయి. అసలు మామూలుగా ఇండియన్ హీరోలు ఎవరూ ఊహించను కూడా ఊహించని వెరైటీ డ్రస్ వేశాడు బీ-టౌన్ సూపర్ స్టార్!
కిందా, మీదా మొత్తం బ్లూ కలర్ సాటిన్ ట్రాక్స్ ధరించిన రణవీర్ పెద్ద జుట్టుతో ఫోజులిచ్చాడు. అది చాలదన్నట్టు నెత్తిన ఓ ఎర్రటి పెద్ద టోపీ. భుజానికి హీరోయిన్స్ వేసుకున్నట్టు ఓ లెదర్ బ్యాగ్! ‘ద్యావుడా!’ అంటున్నారు నెటిజన్స్! బ్లూ, రెడ్ కలర్ కాంబినేషన్, ఓ హ్యాండ్ బ్యాగ్… ఇదంతా రణవీర్ కి కొత్తేం కాదు. ఆయన అప్పుడప్పుడూ ఇలాంటి కలర్ ఫుల్ కల్లోలం సృష్టిస్తూనే ఉంటాడు. బాలీవుడ్ లో మరే నటుడు ఇంతగా ‘ఓవర్ ఫ్యాషన్’ లుక్స్ తో కెమెరా ముందుకు రాడు. రణవీర్ కు ఒక్కడికే సాధ్యం…
రణవీర్ సింగ్ విచిత్రమైన డ్రస్సింగ్ గురించి ఎవరు ఏమి మాట్లాడినా ఆయన లుక్ మొత్తం హాలీవుడ్ నటుడు జారెడ్ లెటోలాగా ఉండటం అందరూ గమనించారు. ‘జస్టిస్ లీగ్’ సినిమాలో లెటో ‘జోకర్’ పాత్రని చేశాడు. ఆయన ఓ ఫోటోషూట్ లో వేసినట్టే రణవీర్ సేమ్ టూ సేమ్ కనిపించేశాడు! అందుకే, ఆయన బెస్ట్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ కూడా ‘వీర్ లెటో’ అంటూ కామెంట్ చేశాడు. రణవీర్ తో నెక్ట్స్ మూవీ చేయబోతోన్న కరణ్ జోహర్ బ్యూటీ.. ఆలియా కూడా… ‘హో!హో!హో!’ అంటూ స్పందించింది!