తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో హనుమంతరావు ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈమేరకు సోనియా గాంధీ ఆయనకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. వీహెచ్ త్వరగా కోలుకోవాలని, మీ రాజకీయ అనుభవం కాంగ్రెస్ పార్టీకి అవసరమని సోనియా పలకరించినట్లు తెలుస్తోంది. తనకు ఫోన్ చేసిన సోనియాకు వీహెచ్ ధన్యవాదాలు తెలిపినట్లు సమాచారం.