బాలీవుడ్ లో ఎప్పుడూ భగ్గుమనే క్రేజీ ఫైట్… తాప్సీ, కంగనాదే! కొన్నాళ్లుగా సాగుతోన్న వీరిద్దరి మాటల యుద్ధం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తాప్సీ కంగనా గురించి మాట్లాడటంతో ఈసారి రచ్చ మొదలైంది. కానీ, తాప్సీ పెద్దగా తప్పుగా ఏం మాట్లాడలేదు ఫైర్ బ్రాండ్ కంగనా గురించి. అయినా, బీ-టౌన్ ‘తలైవి’ తాప్సీకి మరోసారి గట్టిగా తలంటేసింది!
ఓ ఇంటర్వ్యూలో… ‘కంగనా మంచి నటి. గతంలోనూ, ఇప్పుడు కూడా, ఇక మీదట కూడా’ అంది తాప్సీ. అంతే కాదు, ఆమెను మంచి నటిగా భావిస్తానని చెప్పి మిస్ పన్ను కంగనా ట్విట్టర్ లో లేకపోవటంతో తానేమీ మిస్ అవ్వటం లేదని తెలిపింది. కంగనా ట్విట్టర్ అకౌంట్ కొన్నాళ్ల కిందట బ్యాన్ అయింది. అదే విషయమై ప్రశ్నించగా తాప్సీ తనకు కంగనా పట్ల గుడ్ ఫీలింగ్, బ్యాడ్ ఫీలింగ్ ఏదీ లేదంటూనే ఆమె వల్ల తన వ్యక్తిగత జీవితంలో వచ్చే లాభనష్టాలు కూడా లేవని పేర్కొంది.
తాప్సీ తన గురించి మరీ తప్పుగా ఏం మాట్లాడకున్నా కంగనా మరోసారి రెచ్చిపోయింది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమెని ఇంకో సారి ‘బీ గ్రేడ్ యాక్ట్రస్’ అంటూ చులకన చేసింది. ‘’కంగనా వదిలేసిన పాత్రలు ఏవైనా ఉంటే నాకు ఇమ్మం’’టూ తాప్సీ ప్రొడ్యూసర్స్ ను బతిమాలుతుందట! ‘’అయినా నా పేరు వాడుకుని ఎవరైనా ఎదగాలనుకుంటే నాకు అభ్యంతరం ఏం లేదం’’టూ ఘాటుగా స్పందించింది ‘క్వీన్’!
తాప్సీని చెడామడా తిట్టిపోసిన కంగనా… వహీదా రెహ్మాన్, వైజయంతిమాలా, శ్రీదేవి లాంటి లెజెండ్రీ యాక్ట్రెసెస్ మాత్రం తనకు ప్రేరణ అంది. వారి పేర్లు తాను కూడా వాడుకున్నానని చెప్పిన ఆమె మరోకరి తలపై కాళ్లు పెట్టి పైకి ఎక్కేయాలనే దురాలోచన మంచిది కాదని తాప్సీని ఉద్దేశించి కామెంట్ చేసింది! చూడాలి మరి, ఇప్పుడిక ‘తప్పడ్’ బ్యూటీ తలైవి తిట్లకు ఎలా స్పందిస్తుందో!