కేంద్ర ప్రభుత్వం ఖేల్‌రత్న అవార్డులు గురువారం ప్రకటించింది. నలుగురికి ఖేల్రత్న అవార్డులు ఇవ్వనుంది. వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ కుమార్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, హాకీ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్, షూటింగ్‌లో ఒలింపిక్స్ పతక విజేత మనుభాకర్‌లకూ కేంద్రం ఈ అవార్డులు ప్రకటిచింది. 17 మంది పారా అథ్లెట్లు సహా 32 మందికి అర్జున అవార్డులు, ఐదుగురికి ద్రోణాచార్య అవార్డు, ఇద్దరు క్రీడాకారులను జీవితకాల అర్జున అవార్డు గ్రహీతలుగా కేంద్రం ప్రకటించింది. జనవరి 17న రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేయనున్నారు.
Read Also: Boney Kapoor: “అల్లు అర్జున్‌ను నిందించాల్సిన అవసరం లేదు”.. బాలీవుడ్ నిర్మాత కీలక వ్యాఖ్యలు
మను భాకర్:
పారిస్ ఒలింపిక్స్‌లో మను చరిత్ర సృష్టించింది. స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఎడిషన్ గేమ్స్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయురాలిగా నిలిచింది. ఆమె మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం సంపాదించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మరొకటి సాధించి, ఒలింపిక్ షూటింగ్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా నిలిచింది.
గుకేష్ కుమార్:
అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా గ్యారీ కాస్పరోవ్ దీర్ఘకాల రికార్డును బద్దలు కొట్టాడు గుకేష్.. సింగపూర్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌పై 14వ రౌండ్ విజయం క్రీడా దిగ్గజాలలో అతని స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
హర్మన్‌ప్రీత్ సింగ్:
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించి, ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ విజయాన్ని అందించిన పురుషుల హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు ప్రకటించింది.
ప్రవీణ్ కుమార్:
ప్రవీణ్ కుమార్ పారిస్ పారాలింపిక్స్‌లో పురుషుల హైజంప్‌లో బంగారు పతకాన్ని సాధించాడు.
అర్జున అవార్డు విజేతలు..
జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్)
అన్ను రాణి (అథ్లెటిక్స్)
నీతు (బాక్సింగ్)
సావీతీ (బాక్సింగ్)
వంతిక అగర్వాల్ (చెస్)
సలీమా (హాకీ)
అభిషేక్ (హాకీ)
సంజయ్ (హాకీ)
మనీశా రాం దాస్ (పారా బ్యాడ్మింటన్)
కపిల్ పర్మార్ (పారా జుడో)
మోనా అగర్వాల్ (పారా షూటింగ్)
రుబినా ఫ్రాన్సిస్ (పారా షూటింగ్)
అర్జున అవార్డ్స్ (లైఫ్‌టైమ్)
సుచా సింగ్ (అథ్లెటిక్స్)
మురళీకాంత్ రాజారాం పెట్కర్ (పారా స్విమ్మింగ్)
ప్రీతి పాల్ (పారా అథ్లెటిక్స్)
జీవాంజి దీప్పతి ((పారా అథ్లెటిక్స్)
అజీత్‌సింగ్ ((పారా అథ్లెటిక్స్)
సచిన్ సర్జేరావు ఖిలారి (పారా అథ్లెటిక్స్)
ప్రణవ్ సూర్మ (పారా అథ్లెటిక్స్)
హెచ్. హోకాటో సీమ (పారా అథ్లెటిక్స్)
సిమ్రాన్ (పారా అథ్లెటిక్స్)
నవ్‌దీప్ (పారా అథ్లెటిక్స్)
నితీశ్ కుమార్ (పారా బ్యాడ్మింటన్)
తులసీమతి మురుగేశన్ (పారా బ్యాడ్మింటన్)
జర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ)
సుఖ్‌జీత్ సింగ్ (హాకీ)
స్వప్నిల్ సురేష్ కుసాలే (షూటింగ్)
సరబ్‌జోత్ సింగ్ (షూటింగ్)
అభయ్ సింగ్ (స్క్వాష్)
సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్)
అమన్ (రెజ్లింగ్)
రాకేశ్ కుమార్ (పారా ఆర్చర్)
నిత్య శ్రీ సుమతి శివన్ (పారా బ్యాడ్మింటన్)