రాజ్‌కోట్ వేదికగా ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగింది. కేవలం 70 బంతుల్లోనే 100 పరుగులు సాధించి.. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత మహిళా ప్లేయర్‌గా స్మృతి మంధాన నిలిచింది. అంతేకాకుండా.. మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డే క్రికెట్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన నాల్గవ క్రీడాకారిణిగా ఆమె నిలిచింది.
సంక్రాంతి వేళ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గాలిపటం ఎగరవేత విషాదాన్ని నింపింది. చంద్రగిరి పట్టణం బీడీ కాలనీలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. సమీర్(12) అనే బాలుడు మరో బాలుడితో కలిసి మేడపై గాలిపటం ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో ఓ బాలుడు కిందపడి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
నార్సింగి పీఎస్ పరిధిలో జంట హత్యల కేసుపై పోలీసులు అప్‌డేట్ ఇచ్చారు. ఆదివారం రాత్రి జంట హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్‌గా గుర్తించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో గ్రామస్థులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పండుగ కళ వచ్చింది.. పండక్కి అందరూ సొంత ఊళ్లకు వెళుతున్నారు. ఇది వరకు ఇలా వెళ్లే వారు కాదని అన్నారు. మరోవైపు.. విజన్ 2047ను ప్రవేశపెట్టాను.. ప్రతి ఇంటికి హెల్త్, వెల్త్, హ్యాపీ అందించాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో మకర సంక్రాంతి సందర్భంగా ప్రభల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాదిగా ప్రజలు ప్రభల ఉత్సవాన్ని చూసేందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఉత్సవ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశారు.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. కొత్త కొత్త సంస్థలతో పాటు ప్రముఖ కంపెనీలు కూడా ఈ సెగ్మెంట్‌పై ఫోకస్ చేయడంతో కస్టమర్స్‌కు మంచి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆంపియర్ 2025 జనవరిలో విడుదల చేసింది.
డిసెంబర్ 2024 నెలలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం ప్రకటించింది. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పురుషుల విభాగంలో బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరుగుతున్న కోడిపందాల్లో కుటుంబ సమేతంగా వచ్చి సందడి చేస్తున్నారు అతిధులు. పెద్ద ఎత్తున జరుగుతున్న కోడిపందాలను చూస్తూ చిన్న పెద్ద అంతా ఆనందంగా గడుపుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబ సభ్యులంతా పండుగ వాతావరణం ఆస్వాదిస్తున్నామంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ టీమిండియా స్టార్ బ్యాటర్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అతను తన దృష్టిని మరల్చాల్సిన అవసరం ఉందని అన్నాడు. ప్యూచర్ ఆఫ్ ఇండియాగా భావించే శుభ్‌మన్ గిల్ తన జుట్టుపై కాకుండా బ్యాటింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పాడు. గిల్ ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో అతని ప్రదర్శన నిరాశపరిచింది.