Double Murder: జంట హత్యల కేసుపై పోలీసులు సంచలన విషయాలు..
- నార్సింగి పీఎస్ పరిధిలో జంట హత్యల కేసు అప్‌డేట్
- ఆదివారం రాత్రి జంట హత్యలు జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు
- మృతుడు మధ్యప్రదేశ్ కు చెందిన అంకిత్ సాకేత్ గా గుర్తింపు
- మృతుడి మృతదేహానికి 60 మీటర్ల దూరంలో మహిళ మృతదేహం లభ్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నార్సింగి పీఎస్ పరిధిలో జంట హత్యల కేసుపై పోలీసులు అప్‌డేట్ ఇచ్చారు. ఆదివారం రాత్రి జంట హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్‌గా గుర్తించారు. నానక్‌రాం గూడ హనుమాన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటు్న అంకిత్ సాకేత్.. హౌజ్ కీపింగ్‌గా పని చేస్తున్నాడు. మృతుడి మృతదేహానికి 60 మీటర్ల దూరంలో మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు. ఘటన స్థలంలో బైక్ తాళాలు స్వాధీనం చేసుకున్నారు. బైక్ ట్రేస్ అవుట్ అయితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు 30 నుండి 32 ఏండ్ల వయసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు.. మహిళ వివరాలను పోలీసులు సేకరించారు. మృతురాలు బిందు (25) చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన మహిళాగా గుర్తించారు పోలీసులు. అంకిత్ సాకేత్‌తో సన్నిత సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈనెల 8వ తేదీన మృతుడు అంకిత్ ఎల్‌బీ నగర్ నుంచి నానక్‌రామ్ గూడకు తీసుకొచ్చి స్నేహితురాలి గదిలో ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. 11వ తేదీ రాత్రి హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.
Also Read
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
పుప్పాల్‌గూడలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టపై జంట హత్యలు కలకలం రేపుతుంది. సంక్రాంతి సందర్భంగా చిన్నారులు, యువకులు కలిసి గాలిపటాలు ఎగరవేయడానికి అనంత పద్మనాభస్వామి గుట్టపైకి వెళ్లారు. గాలిపటాలు ఎగిరేస్తుండగా.. అవి తెగి పొదల్లో పడటంతో అక్కడి యువకులు వాటిని తీసుకునేందుకు వెళ్లారు. అయితే, పొదల్లోకి వెళ్లిన యువకులు అక్కడ రెండు మృతదేహాలను చూసి భయంతో వణికిపోయారు. యువకులు వెంటనే ఆ ప్రాంతం నుంచి పరుగులు పెట్టి 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు.
Read Also: CM Chandrababu: ప్రతి ఇంటికి హెల్త్, వెల్త్, హ్యాపీ అందించాలన్నదే నా లక్ష్యం..
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!