దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. కొత్త కొత్త సంస్థలతో పాటు ప్రముఖ కంపెనీలు కూడా ఈ సెగ్మెంట్‌పై ఫోకస్ చేయడంతో కస్టమర్స్‌కు మంచి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆంపియర్ 2025 జనవరిలో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఏ కెపాసిటీ బ్యాటరీ అందించారు.. ఎలాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి..? ఏ ధరకు కొనుగోలు చేయవచ్చు..? అనే విషయాలు తెలుసుకుందాం…..
Read Also: West Bengal: టీఎంసీ నేతలపై కాల్పులు.. ఇద్దరి పరిస్థితి విషమం
ఆంపియర్ భారత మార్కెట్‌లో మాగ్నస్ నియో పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది (Ampere Magnus Neo). ఇది మాగ్నస్ యొక్క కొత్త వేరియంట్‌గా కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇక ఈ స్కూటర్ ఫీచర్ల విషయానికొస్తే.. 12 అంగుళాల టైర్లను కలిగి ఉంది. అంతే కాకుండా.. ఇది 165 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో డ్యూయల్ టోన్ ఇంటీరియర్, IoT ఎనేబుల్డ్ ఇన్‌స్ట్రుమెంట్ డిజిటల్ క్లస్టర్, లైవ్ ట్రాకింగ్, ఫైండ్ మై స్కూటర్, యాంటీ థెఫ్ట్ అలారం వంటి ఫీచర్లు ఉన్నాయి.
Read Also: Sharad Pawar: ఇండియా కూటమిపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో శక్తివంతమైన 2.3 kWh సామర్థ్యంతో LFP బ్యాటరీని అందించారు. దీనితో పాటు 7.5A ఛార్జర్ ఇచ్చారు. పూర్తి ఛార్జింగ్ తర్వాత ఈ స్కూటర్ 80 నుండి 100 కిలోమీటర్ల వరకు నడపవచ్చని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్‌లో ఉన్న మోటార్‌తో గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. ఆంపియర్ మాగ్నస్ నియో ధర.. ఎక్స్-షోరూమ్ ధర రూ.79999 ఉంది. అంతేకాకుండా.. 75 వేల కిలోమీటర్లు, ఐదేళ్ల వారంటీని ఇస్తోంది కంపెనీ. ఈ స్కూటర్ బ్లాక్, బ్లూ, రెడ్, వైట్, గెరీ వంటి కలర్ ఆప్షన్‌లతో అందిస్తున్నారు.