సంక్రాంతి వేళ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గాలిపటం ఎగరవేత విషాదాన్ని నింపింది. చంద్రగిరి పట్టణం బీడీ కాలనీలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. సమీర్(12) అనే బాలుడు మరో బాలుడితో కలిసి మేడపై గాలిపటం ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో ఓ బాలుడు కిందపడి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో పక్కనే ఉన్న సమీర్ పై మేనమామ షబ్బీర్ కోపంతో గదిలో పెట్టి గొళ్ళెం వేశాడు. మళ్లీ తిరిగి వచ్చి కొడుతాడన్న భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. మరోవైపు.. మదనపల్లెలో గాలిపటం ఎగరవేస్తున్న సమయంలో కరెంట్ షాక్ కొట్టడంంతో మరో బాలుడు మృతి చెందాడు.