David Warner: ఎయిరిండియాపై డేవిడ్ వార్నర్ ఫైర్.. కారణమిదే..?
- ఎయిర్ ఇండియాపై డేవిడ్ వార్నర్ ఆగ్రహం
- వార్నర్ వెళ్లాల్సిన విమానం గంట ఆలస్యం
- పైలెట్ ఆలస్యంగా రావడంతో మండిపడిన వార్నర్
- పైలెట్ లేరని తెలిసి గంట ముందే బోర్డింగ్ ఎందుకిచ్చారంటూ వాగ్వాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎయిరిండియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి ఆస్ట్రేలియాకు తాను వెళ్లాల్సిన విమానం గంట ఆలస్యం అయింది. దీంతో.. సోషల్ మీడియా వేదికగా డేవిడ్ వార్నర్ ఎయిరిండియాపై ఫైర్ అయ్యారు. ‘X’లో పైలెట్ ఆలస్యంగా వస్తున్నాడని తెలిసి కూడా గంట ముందే బోర్డింగ్ ఎందుకు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైలెట్ లేని విమానంలో గంటపాటు ఎదురు చూడాలా..? అని పోస్ట్ చేశారు.
@airindia we’ve boarded a plane with no pilots and waiting on the plane for hours. Why would you board passengers knowing that you have no pilots for the flight? 🤦♂️🤦♂️
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
— David Warner (@davidwarner31) March 22, 2025
వార్నర్ వ్యాఖ్యలపై ఎయిరిండియా స్పందించింది. ఈ ఆలస్యానికి కారణం.. బెంగళూరులో ప్రతికూల వాతావరణ పరిస్థితులే అని తెలిపింది. వాతావరణ సమస్యల కారణంగా అనేక విమానయాన సంస్థలు విస్తృతంగా విమానాల మళ్లింపులు, ఆలస్యాలను ఎదుర్కొన్నాయని పేర్కొంది. ఈ కారణంగా ఆ విమానానికి కేటాయించిన సిబ్బంది మరో పనిలో బిజీగా ఉన్నారని.. ఇది మరింత ఆలస్యానికి దారితీసిందని ఎయిర్ ఇండియా వివరణ ఇచ్చింది. అసౌకర్యానికి బాధితులైన వార్నర్, ఇతర ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా విచారం వ్యక్తం చేసింది.
Dear Mr. Warner, today's challenging weather in Bengaluru caused diversions and delays across all airlines. The crew operating your flight was held up on an earlier assignment affected by these disruptions, which led to a delay in departure. We appreciate your patience and thank…
— Air India (@airindia) March 22, 2025
డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2025లో ఆడటం లేదు. ఇటీవల జెడ్డాలో జరిగిన మెగా వేలంలో అతను అమ్ముడుపోలేదు. ఐపీఎల్‌లో అవకాశం లభించకపోయినప్పటికీ.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో కనిపించనున్నాడు. ఏప్రిల్ 11 నుండి మే 18 వరకు జరగనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025లో కరాచీ కింగ్స్ తరపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు.. సినిమాలలో కూడా నటిస్తున్నారు. తెలుగులో ‘రాబిన్ ఉడ్’ చిత్రంలో ఆయన నటించారు. ఈ సినిమా మార్చి 28వ తేదీన రిలీజ్ కానుంది
తాజావార్తలు
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!