ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3.30 గం.కు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు సంబందించి టికెట్ల బ్లాక్ దందా మొదలైంది. తమ అభిమాన క్రికెటర్స్, జట్టును చూసేందుకు ఫ్యాన్స్ ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడటం లేదు. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు ఐపీఎల్ టికెట్లను బ్లాక్‌లో అమ్ముతూ అందినకాడికి దోచుకుంటున్నారు.
Read Also: IPL : ఐపీల్ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న బాలీవుడ్.. కారణం ఏంటంటే.?
రేపు జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ టిక్కట్లను విచ్చలవిడిగా బ్లాక్‌లో అమ్ముతున్నారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర మ్యాచ్ టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముతున్న భరద్వాజ్ అనే వ్యక్తిని ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. అనంతరం.. అతని వద్ద నుంచి టికెట్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు భరద్వాజ్, టిక్కెట్లను ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు ఎస్ఓటి పోలీసులు. ఈ క్రమంలో ఉప్పల్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: Supriya Sule: ఎయిరిండియా తీరుపై సుప్రియా సూలే తీవ్ర అసహనం
మరోవైపు రేపటి మ్యాచ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. 2700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే.. ఈ మ్యాచ్‌కు వచ్చే అభిమానులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా.. 300 మంది పోలీసులు ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్‌లో 1218 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. బందోబస్తులో భాగంగా.. 12 బెటాలియన్లు , 2 ఆక్టోపస్ బృందాలు ,10 మౌంటెడ్ పోలీసులు విధులు నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. 450 సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు.. స్టేడియంలోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. కంట్రోల్ రూమ్‌కు ఏసీపీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరగనుంది. స్టేడియం ఎంట్రెన్స్ వద్ద స్నిఫర్ డాగ్స్ తో పాటు బాంబ్ స్వాడ్ తనిఖీలు చేపట్టనున్నారు. మహిళల భద్రత కోసం మఫ్టీలో షీ టీమ్స్ బృందాలు ఉండనున్నాయి. అలాగే.. మ్యాచ్ కోసం వచ్చే అభిమానులకు ఐదు చోట్ల స్టేడియం పరిసరాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ల్యాప్ టాప్, మ్యాచ్ బాక్స్, అంబ్రెల్లా, ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధించారు.