4వ తరగతి చదువుతున్న చిన్నారిని టీచర్ నిర్దాక్షిణ్యంగా కొట్టిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. గురువుగారి నిర్వాకం అంతా సీసీటీవీ ఫుటేజీలో బయటపడింది. 30 నిమిషాల్లో ఉపాధ్యాయుడు 23 సార్లు చెంపదెబ్బ కొట్టాడు. అయితే వచ్చే వారమే గురువుగారి వివాహం జరగనుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ముంబైలో వర్షాలు దంచికొడుతున్నాయి. శనివారం నుంచి మహానగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆదివారం ఘట్‌కోపర్ ప్రాంతంలో ఓ భవనంలో కొంతభాగం కుప్పకూలింది. దీంతో చాలా వరకు ఆస్తినష్టం వాటిల్లింది. అంతేకాకుండా శిథిలాల కింద ఆరుగురు చిక్కుకున్నారు. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు నలుగురిని సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే వారిని ప్రథమ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు తెలుపుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ తన మూడు రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని శనివారం ఈజిప్ట్‌కు చేరుకున్నారు. ఈజిప్టు రాజధాని కైరోలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీని రిసీవ్ చేసుకోవడానికి ఈజిప్ట్ ప్రధాని వచ్చారు. అక్కడ ఇద్దరు నేతలూ ఆప్యాయంగా కలుసుకున్నారు.
చట్నీల్లో మామిడి, టమాట, నిమ్మలాంటివి చూశాం.. తిన్నాం. ఇక నాన్ వెజ్ లో కూడా కొన్ని రకాల చట్నీలు ఉన్నాయని తెలుసు. కానీ వెరైటీగా చీమల పచ్చడి కూడా ఉందట. అది కూడా మన భారతదేశంలోని కొందరు తింటున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఆ చట్నీ రుచి అద్భుతంగా ఉంటుందని.. అనేక వ్యాధులను నయం చేస్తుందని అంటున్నారు. అయితే రెడ్ యాంట్ చట్నీ టేస్ట్ సంగతి పక్కనపెడితే.. వాటిని చెట్నీ తయారు చేయడం చూస్తే కచ్చితంగా తినడం మానేస్తారు.
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ టామీ బ్యూమాంట్ డబుల్ సెంచరీ సాధించింది. మ్యాచ్‌లో మూడో రోజు టామీ ఈ ఘనత సాధించింది. టెస్ట్‌ల్లో ఆమెకు మొదటి డబుల్ సెంచరీ కాగా.. టెస్ట్‌ల్లో ఇంగ్లీష్ మహిళా బ్యాట్స్‌మెన్ సాధించిన మొదటి డబుల్ సెంచరీ.
ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో ఆసియా క్రీడలు జరగనున్నాయి. చైనాలో జరగనున్న ఈ గేమ్స్‌లో క్రికెట్‌ను కూడా చూడనున్నారు. ఈ క్రీడల్లో భారత పురుషుల, మహిళల జట్లు పాల్గొంటాయి. ఆసియా క్రీడలకు తమ పురుషుల, మహిళల జట్లను పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి ముందుగా బోర్డు సిద్ధంగా లేకపోయినా ఇప్పుడు అంగీకరించడంతో.. ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ ఆడనుంది. అయితే ఈ గేమ్‌లలో భారత మహిళల జట్టు ఆడనుంది. మరోవైపు ఇండియాలో జరిగే వన్డే ప్రపంచకప్‌కు ప్రధాన జట్టు సిద్ధమవుతున్నందున.. పురుషుల విభాగంలో భారత…
చాలా మంది ముఖం మీద చిన్న చిన్న రోమాలు, వెంట్రుకలతో బాధపడుతూ ఉంటారు. అవి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. అయితే రిమూవ్ చేసుకోవడానికి పార్లర్‌కు వెళ్లేందుకు కూడా కొందరికి సమయం దొరకడం లేదు. అటువంటి పరిస్థితిలో ఇంట్లోనే ఉండి.. మీ ముఖం మీదున్న అవాంఛిత జుట్టును తొలగించుకోవచ్చు. అవి పోవాలంటే కొన్ని సహజ మార్గాలు పాటిస్తే.. ఇక మళ్లీ రావు.
మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. 3 గంటల పాటు సాగిన ఈ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర సీఎం ఎన్ బీరెన్ సింగ్‌ను తొలగించాలని ప్రతిపక్షం డిమాండ్ చేయగా.. పలువురు ప్రతిపక్ష నాయకులు రాష్ట్రానికి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపాలని కోరారు.
ఇతను చిన్న ధోని, అద్భుతమైన హెలికాప్టర్ షాట్ భలే కొడుతున్నాడు. అచ్చం మహేంద్ర సింగ్ ధోనీలా దంచేస్తున్నాడు.. ఇప్పుడీ ఈ బుడ్డోడు ఆడే షాట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రతి ఆహారానికి సంబంధించి ఓ ప్రత్యేకత ఉంటుంది. అంతేకాకుండా దానికంటూ ఓ రుచిని కలిగి ఉంటుంది. మనం తీసుకునే ఆహారపదార్థాలలో కొన్నింటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అవి తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. విటమిన్ డి మరియు కాల్షియం, ఐరన్ మరియు విటమిన్ సి మొదలైన వాటిలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. అయితే కొన్ని కూరలు కావచ్చు, వివిధ ఆహార పదార్థాలు కలిపి తినడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెరుగును పాలతో కలిపి తినకూడదని మనందరికీ తెలిసిన విషయమే.