ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తాంత్రికుడి ఇంటి బయట ఓ మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. తాంత్రికుడు మొదట తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. ఆ తర్వాత తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని మహిళ ఆరోపించింది. ఈ విషయమై మహిళ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయితే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడంలో జాప్యం జరగడంతో ఆ మహిళ సోమవారం తాంత్రికుని ఇంటి బయట ధర్నాకు దిగింది.
త మూడు ఆర్థిక సంవత్సరాల్లో ప్రకటనల కోసం చేసిన ఖర్చులకు లెక్కలు చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం కోరింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోరుతూ, వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయాలని ఆప్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.
రాజస్థాన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యం ఉదంతం మళ్లీ తెరపైకి వచ్చింది. జిల్లాలోని అతిపెద్ద ఆసుపత్రి మధురదాస్ మాథుర్ ఆసుపత్రి ఏర్పాట్ల రహస్యాలు మరోసారి బట్టబయలయ్యాయి. మానసిక వ్యాధి విభాగంలోని వార్డులో నలుగురు రోగుల కాళ్లను ఎలుకలు కొరికేశాయి.
చర్మ సమస్యలు అలెర్జీలు, వాతావరణం వల్ల కాకుండా.. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా వస్తాయి. అయితే మీరు తినే ఆహారం విషయంలో ఎంత మంచిది తీసుకుంటే.. చర్మం అంత అందంగా కనిపిస్తుంది. దానితో మేకప్ అవసరమే ఉండదు. అలా ఉండాలంటే విటమిన్లు, ఖనిజాలు మరియు ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటే మీ చర్మం అద్భుతంగా ఉంటుంది. మీరు చక్కెర పదార్థాలను ఎక్కువగా తిన్నా.. దాని ప్రభావం చర్మంపై కూడా కనిపిస్తుంది.
దేశంలోని ప్రముఖ పెర్ఫార్మెన్స్ బైక్ తయారీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త శక్తివంతమైన ఇంజన్‌తో తన వాహన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క 350, 450 మరియు 650 సిసి ఇంజిన్ బైక్‌లను ఆస్వాదించారు. ఇప్పుడు ఆ కంపెనీ 750 సిసి సెగ్మెంట్‌లోకి కూడా ప్రవేశించడానికి సిద్ధమవుతోంది.
రూ.2000 నోట్ల (Rs 2000 notes)ను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకున్న ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. 2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడంతో ఆ నోట్లన్నీ బ్యాంకులకు చేరుకుంటున్నాయి. తాజా లెక్కల ప్రకారం.. మే 19 నుంచి 76 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయి.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా అక్కడికి చేరుకుంది. ఆ జట్టుతో 2 టెస్ట్ లు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. జూలై 12 నుంచి 16 వరకు డొమినికాలో తొలి టెస్టు జరగనుంది. పర్యటనకు సంబంధించి కింగ్ కోహ్లీ కూడా వెస్టిండీస్ చేరుకున్నాడు. అంతేకాకుండా టీమిండియాలో కూడా చేరాడు. కోహ్లీ చేరగానే.. టీమ్ లో సరదా మొదలైంది. ప్రస్తుతం బార్బడోస్‌లో ఉన్న టీమిండియా సన్నాహాలు ప్రారంభించింది. కాగా.. భారత ఆటగాళ్లు బీచ్‌లో భీకరంగా వాలీబాల్ ఆడుతూ సరదాగా గడిపారు.
సమాజంలో తొందరగా గుర్తింపు పొందేందుకు జనాలు పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారు. రైలు వస్తుండగా సెల్ఫీలు తీసుకోవడం.. రైలు వెళ్తుండగా ఫుట్ పాత్ నుండి వేలాడం ఇలాంటి వీడియోలు ఇంతకుముందు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాంటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా త్వరగా గుర్తింపు పొందుతారని ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వీడియోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
నీళ్ల డ్రమ్ముతో కూలర్ తయారు చేసేశాడు. చూస్తే ఔరా అంటారు. ప్రస్తుతం ఆ డ్రమ్ముతో తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే డ్రమ్ములో కూలర్ తయారు చేయాడానికి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. సాధారణంగా చాలా మందికి కూలర్ కొనడానికి తగిన బడ్జెట్ ఉండదు
విస్తారా విమానంలో ప్రయాణికుడు తోటి ప్రయాణికుడితో తీవ్ర వాగ్వాదానికి దిగుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇతర ప్రయాణీకుడు తన కుమార్తెను వేధించాడని ప్రయాణీకుడు ఆరోపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.