గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా హృద్రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అత్యంత భయానక విషయమేమిటంటే యువతలో కూడా గుండె జబ్బులు, గుండెపోటు సమస్యలు కనిపిస్తున్నాయి. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మద్యపానం-ధూమపానం మరియు వ్యాయామం లేకపోవడం వంటివి గుండె జబ్బులు పెరగడానికి ప్రధాన కారణాలు.
కొత్త సెల్టోస్ భారత మార్కెట్లో ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. జూలై 4న సెల్టోస్ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. గత కొంతకాలంగా ఆటో మేకర్ ఈ కారు టీజర్‌లను విడుదల చేస్తోంది. అయితే మరోసారి రాబోయే సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ టీజర్ విడుదలైంది.
హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలీన ప్రక్రియ అధికారికంగా పూర్తియింది. దీంతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రంపంచంలో నాలుగో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. విలీనం తర్వాత కంపెనీ సైజు ఎంత పెరుగుతుంది, లాభాలు ఎలా ఉన్నాయి, షేర్ల కేటాయింపు, ఉద్యోగుల సంఖ్య ఏవిధంగా ఉంటుందో తెలుసుకుందాం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బోర్డ్స్ ఆఫ్ డైరెక్టర్లు తమ విలీన ప్రతిపాదనను శనివారం అమోదించారు. విలీన ప్రక్రియ అధికారికంగా పూర్తి కావడంతో 44 ఏళ్ల సంస్థ అయిన హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ జూలై 1 […]
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే హెచ్ఆర్ఏ పెరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చిలోనే డీఏను పెంచడంతో అందుకు అనుగుణంగా హెచ్ఆర్ఏ పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ చివరిసారిగా 2021 జూలైలో పెరిగింది. అప్పుడు డీఏ తొలిసారి 25 శాతం దాటి 28 శాతానికి పెరిగింది.
వారు ఎక్కాల్సిన రైలు రాలేదని కాస్త విశ్రాంతి తీసుకుంటున్న ప్రయాణికులపై ఓ రైల్వే పోలీస్.. అమానవీయంగా ప్రవర్తించాడు. రైల్వే ప్లాట్ ఫామ్ పై పడుకున్న ప్రయాణికులపై నీళ్లు చల్లి లేపాడు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
2023 ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అక్టోబర్-నవంబర్‌లో 10 వేదికల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు పాకిస్థాన్ భారత్‌కు వచ్చే దానిపై క్లారిటీ లేదు. అంతేకాకుండా బోర్డు పాకిస్థాన్ ప్రభుత్వానికి 3 ప్రశ్నలు వేసింది. అయితే ఆ సమాధానాలు వచ్చిన తర్వాతే పాకిస్తాన్ భారతదేశానికి వచ్చేట్లుగా తెలుస్తుంది.
ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్‌కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో రక్షణ శాఖ ఒప్పందానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. భారత్‌తో కలిసి మల్టీ రోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌ను అభివృద్ధి చేయడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ ఇంజిన్ల తయారీ పూర్తిగా ఇండియాలోనే చేపట్టనున్నారు. ఇటీవల అమెరికాతో కుదిరిన GE-414 ఇంజిన్ డీల్ తరహాలోనే తాజాగా ఫ్రాన్స్ భారత్‌కు ఆఫర్ ఇచ్చింది.
వాతావరణంలో మార్పుల కారణంగా కొంతమంది పిల్లలు చాలా త్వరగా అనారోగ్యానికి గురవుతారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారుతుంది. చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు పిల్లలు అనారోగ్యానికి గురవుతారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఫ్రాన్స్ లో హింస ఆగడం లేదు. నాలుగు రోజుల క్రితం పారిస్‌లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు.. ఓ 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చిచంపారు. దీంతో అల్లర్లు రచ్చరచ్చ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ అల్లర్లు కొనసాగుతున్నాయి.
పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. వేసవిలో మామిడి తర్వాత ఎక్కువగా పుచ్చకాయను తింటుంటారు. పుచ్చకాయల్లో ఆమ్లాజనకాలు మరియు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పుచ్చకాయను తిన్న తర్వాత నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది ఆరోగ్య పరంగా అస్సలు మంచిది కాదని.. జీర్ణశయాంతర ప్రేగులపై ప్రభావం చూపుతుందని తెలుపుతున్నారు. పుచ్చకాయలో నీరు, చక్కెర మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి.