Viral Video: బస్సుల్లోనూ, రైళ్లలోనూ గొడవపడటం మీరు చూసే ఉంటారు. కదులుతున్న రైలులోనో, బస్సులోనో ఎవరికైనా గొడవ జరిగితే అది చాలా మామూలే. కానీ ఆకాశంలో ఎగురుతున్న విమానంలో గొడవ జరుగుతుందని చెబితే మీరు నమ్ముతారా? విమానంలో ఎవరూ గొడవ కానీ పోట్లాట పడరని మీరు భావిస్తారు. అలా అనుకుంటే ఈ వీడియో చూడండి మీరు నమ్ముతారు. విమానాల్లో ఇలాంటి గొడవలు మొదటిసారి కానప్పటికీ.. ఇంతకు ముందు కూడా విమానాల్లో ఎన్నో గొడవలు జరిగాయి.
Akhil Agent in OTT: అఖిల్ ఏజెంట్ ఓటీటీలోకి వస్తుందా? రాదా?
విస్తారా విమానంలో ప్రయాణికుడు తోటి ప్రయాణికుడితో తీవ్ర వాగ్వాదానికి దిగుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇతర ప్రయాణీకుడు తన కుమార్తెను వేధించాడని ప్రయాణీకుడు ఆరోపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాల్లో ఎగురుతున్న విమానంలో ఒక ప్రయాణీకుడు గట్టిగా అరుస్తూ కనిపించాడు. దానితో అతన్ని ఆపడానికి సిబ్బంది ప్రయత్నించారు.
Dulquer Salmaan: దుల్కర్ కు ఏమైంది.. అలాంటి వీడియో ఎందుకు పోస్ట్ చేశాడు.. ?
అసలు విషయానికొస్తే.. విస్తారా విమానంలో ఒక ప్రయాణికుడు మరొక ప్రయాణికురాలిని వేధించాడని ఆరోపించాడు. తన కూతురి పక్కన కూర్చున్న ఓ ప్రయాణికుడు తన కూతురిని అనుచితంగా తాకాడని విమానంలో కోపోద్రిక్తుడైన తండ్రి పేర్కొన్నాడు. విమానంలోని ఓ ప్రయాణికుడు ఈ వీడియోను రికార్డ్ చేసి.. ట్విట్టర్ లో షేర్ చేసారు. ఎదురుగా ఉన్న లేన్‌లో కూర్చున్న అవతలి వ్యక్తిపై.. తన తండ్రి గొడవకు దిగాడు. తన కుమార్తెను తాకడానికి ఎంత ధైర్యం అంటూ అతనిపై అరిచాడు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది యూజర్లు ఈ వీడియోపై రియాక్షన్స్ కూడా ఇస్తున్నారు.
Kalesh Inside the vistara flight b/w Two man over a guy touched another man Daughter pic.twitter.com/BTlS1EHhma
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 2, 2023