Viral Video: సమాజంలో తొందరగా గుర్తింపు పొందేందుకు జనాలు పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారు. రైలు వస్తుండగా సెల్ఫీలు తీసుకోవడం.. రైలు వెళ్తుండగా ఫుట్ పాత్ నుండి వేలాడం ఇలాంటి వీడియోలు ఇంతకుముందు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాంటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా త్వరగా గుర్తింపు పొందుతారని ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వీడియోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఒక వ్యక్తి రైల్వే ట్రాక్‌ల క్రింద పడుకొని ఉండగా.. దానిపై రైలు అత్యంత వేగంతో వెళ్తుంది. ఈ వీడియోను అభిషేక్ నరేడా అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Revanth Reddy: బీజేపీ+బీఆర్ఎస్=బై బై.. రేవంత్ రెడ్డి ధ్వజం
ఈ వైరల్ వీడియో ఎక్కడిదో తనకు తెలియదని, ఇలాంటి వీడియోలు చేయడం చాలా తప్పు అని ట్వి్ట్టర్ లో పోస్ట్ చేసిన వ్యక్తి తెలిపాడు. అలాంటి వారిపై రైల్వే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని.. తద్వారా భవిష్యత్తులో ఇలాంటి వీడియోలు చేసే ముందు ఆలోచిస్తారని పేర్కొన్నాడు. ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి రైల్వే పోలీస్ ఫోర్స్ (RPF), కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మరియు రైల్వేలను కూడా ట్యాగ్ చేశారు. ట్రాక్ మరియు గ్రౌండ్ మధ్య గ్యాప్‌లో నీలిరంగు చొక్కా ధరించిన వ్యక్తి పడుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. వీడియోలో కొన్ని క్షణాలు, రైలు ట్రాక్ పై వేగంతో వెళ్తున్నట్లు చూడవచ్చు. చివరికి రైలు వ్యక్తిని దాటుతుంది. తనపై నుండి రైలు వేగంగా వెళ్లినా.. ట్రాక్ కింద మనిషి హాయిగా పడుకుంటాడు. ఈ వీడియోను తన స్నేహితులు రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Panjagutta SaiBaba Temple: ఈ గుడిలో అనుకున్నవి జరిగితీరుతాయి, ఉచిత వైద్యం కూడా!
ఈ వీడియోకు ఇప్పటికే 371 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా ఈ వీడియోపై పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు కామెంట్ చేస్తూ, “అతను ఇండియన్ రైల్వే యాక్ట్ ప్రకారం కటకటాల వెనక్కి వెళ్ళవలసి ఉంటుంది.” మరో వినియోగదారుడు “ఇలాంటి తప్పుదోవ పట్టించే వీడియోలు చెలామణి అవుతున్నాయని, వాటి మూలం మిస్టరీగా మిగిలిపోయినప్పటికీ, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, తద్వారా భవిష్యత్తులో చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.” అని తెలుపుతున్నారు.
वायरल वीडियो कहां का है यह तो पता नहीं लेकिन लोग इस तरह वीडियो बना रहे हैं जो सरासर गलत है ऐसे लोगों के खिलाफ रेलवे पुलिस को कड़ी कार्रवाई करनी चाहिए ताकि भविष्य में ऐसा करने से पहले सौ बार सोचे @RPF_INDIA @AshwiniVaishnaw @RailMinIndia pic.twitter.com/VmqAvN3yYw
— ABHISHEK NAREDA (@NaredaAbhishek) July 1, 2023