Viral Video: ఇప్పటికీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడి వ్యాప్తి కొనసాగుతోంది. వర్షాలు పడుతున్న ఇంకా వేడి పోవడం లేదు. ప్రస్తుతం ఢిల్లీ, యూపీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూలర్, ఫ్యాన్ లేకుండా గడపడం చాలా కష్టం.
Pawan Kalyan: ఇన్స్టాగ్రామ్ లోకి పవన్ కళ్యాణ్.. మొదటి పోస్ట్ ఏంటి అంటే.. ?
అయితే ఓ వ్యక్తి క్రియేటివ్ గా ఆలోచించి.. నీళ్ల డ్రమ్ముతో కూలర్ తయారు చేసేశాడు. చూస్తే ఔరా అంటారు. ప్రస్తుతం ఆ డ్రమ్ముతో తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే డ్రమ్ములో కూలర్ తయారు చేయాడానికి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. సాధారణంగా చాలా మందికి కూలర్ కొనడానికి తగిన బడ్జెట్ ఉండదు. అందుకే వేడి నుండి ఉపశమనం పొందడానికి ఇంట్లో ఉండే డ్రమ్ముతో కూలర్ తయారుచేశాడు. ఇందులో ఫ్యాన్ మోటార్, వాటర్ పంప్, పైపు మరియు అవసరమైన అనేక ఫ్యాబ్రిక్‌లు ఉంటాయి.
Maharashtra NCP Chief: మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్‌గా సునీల్ తట్కరే.. ప్రకటించిన అజిత్ పవార్ వర్గం
ఈ కూలర్ విద్యుత్‌తో అనుసంధానించాడు. అయితే ఈ కూలర్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతోంది. బ్లూ కలర్ డ్రమ్‌పై రెండు బటన్లు ఉంచబడ్డాయి మరియు మూడు స్పీడ్ ఫ్యాన్‌లు కూడా కనిపిస్తాయి. vikramv5840 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తరువాత వాషింగ్ మెషీన్ తయారు చేయమని ఒకరు.. ఇలాంటి అద్భుతాలు ఇండియాలో మాత్రమే చూడగలమని మరొకరు.. వరుసగా కామెంట్లు పెట్టారు.