ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాల ప్రభావంతో హిండన్ నది నీటిమట్టం పెరిగింది. వరదతో నోయిడాలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఎకోటెక్ 3 సమీపంలోని పార్కింగ్ చేసిన వంద కార్లు నీటమునిగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు నోయిడాలో వరద ముప్పు పొంచి ఉండటంతో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు వేలాది ఇళ్లను ఖాళీ చేయించారు. గ్రేటర్ నోయిడాలోని హైబత్ పూర్, ఛోట్ పూర్, షహబేరి ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో 2.50 లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Fishermen Arrest: తమిళనాడుకు చెందిన 9 మంది జాలర్లు అరెస్ట్.. ఆగ్రహంతో మత్స్యకార సంఘాలు
శనివారం నుంచే హిండన్ నది నీటిమట్టం పెరగడం ప్రారంభమైంది. సోమవారం కురిసిన వర్షాలకు హిండన్ నది నీటిమట్టం గణనీయంగా పెరిగింది. దీంతో నీట మునిగిన ప్రాంతాల్లో లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలను ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని అధికారులు కోరుతున్నారు. మరోవైపు హిండన్ నది నోయిడాతో పాటు ఘజియాబాద్‌లో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫరూఖ్ నగర్, మోహన్ నగర్, సాహిబాబాద్ తదితర ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. దీంతో NDRF బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 7000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు ఢిల్లీలోనూ వరద ప్రభావం ఇంకా కొనసాగుతుంది. యమునా నది నీటిమట్టం పెరుగుతుండటంతో.. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పడుతుంది.
#WATCH | Noida, UP: Due to an increase in the water level of Hindon River, the area near Ecotech 3 got submerged due to which many vehicles got stuck. pic.twitter.com/a5WOcLCH02
— ANI (@ANI) July 25, 2023