డ్రగ్స్ అక్రమంగా రవాణా చేస్తున్న విషయంలో సింగపూర్ ప్రభుత్వం అత్యంత కఠిన శిక్షలు అమలు చేస్తుంది. ఇందుకు సంబంధించిన కేసులో ఇద్దరు దోషులను ఉరి తీయనున్నారు. ఆ శిక్షను ఈ వారం అమలు చేయనుంది. ఇందులో ఓ మహిళ కూడా ఉంది. గత 20 ఏళ్లలో సింగపూర్ లో ఓ మహిళను ఉరి తీయడం ఇదే మొదటిసారి. మరోవైపు ఈ ఉరిశిక్షల అమలును నిలిపివేయాలని అక్కడి హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
Srikanth Meka: హీరో శ్రీకాంత్ ఇంట పెళ్లి భాజాలు
ఓ 56 ఏళ్ల వ్యక్తి 50 గ్రాముల హెరాయిన్ ను అక్రమంగా రవాణా చేశాడు. దీంతో ఈ కేసులో దోషిగా తేల్చి బుధవారం (జూలై 26)న చాంగీ జైలులో ఉరి తీయనున్నారు. ఈ మేరకు స్థానిక హక్కుల సంస్థ ట్రాన్స్ ఫార్మేటివ్ జస్టిస్ కలెక్టివ్ తెలిపింది. ఇదే కేసులో మరో మహిళ సారిదేవి దామని(45)కి జూలై 28వ తేదీన ఉరి తీయనున్నారు. 30 గ్రాముల హెరాయిన్ ను అక్రమంగా రవాణా చేసిన కేసులో సారిదేవికి 2018లో ఉరిశిక్ష విధించారు. అప్పటినుంచి జైల్లోనే ఉన్న సారీ దేవికి ఇప్పుడు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఇప్పటికే వారి కుటుంబాలకు నోటీసులు పంపించారని టీజేసీ పేర్కొంది. కానీ దీనిపై జైలు అధికారులు ఏ విధమైన అధికారిక ప్రకటన చేయలేదు.
Vaishnavi Chaitanya: ‘బేబీ’ని మెచ్చిన ఇస్మార్ట్ రామ్.. వాటిని పట్టుకొని గాల్లో తేలిపోతున్న వైష్ణవి
ఈ ఉరిశిక్ష అమలు అయితే 20 ఏళ్లలో ఓ మహిళను ఉరి తీయడం సింగపూర్లో ఇదే మొదటిసారి అవుతుంది. చివరగా 2004లో డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో 36 ఏళ్ల మహిళకు ఉరిశిక్ష వేశారని టీజేసీ కార్యకర్త కోకిల అన్నామలై తెలిపారు. సింగపూర్ లో ప్రపంచంలోనే అత్యంత కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. హత్యలు, కిడ్నాప్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి కేసుల్లో మరణ శిక్షలలు విధిస్తారు. 500 గ్రాముల కంటే ఎక్కువ గంజాయి, 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్ ను అక్రమంగా రవాణా చేసిన కేసుల్లో దోషులకు మరణశిక్ష విధిస్తారు. కరోనా నేపథ్యంలో సింగపూర్ లో రెండేళ్ల పాటు మరణశిక్షలను అమలు చేయకుండా ఆపేశారు. ప్రస్తుతం మళ్ళీ అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు 13మందిని ఉరి తీశారు.