రాజస్థాన్‌లోని అల్వార్ నుంచి పాకిస్థాన్ కు వెళ్లిన అంజు.. అక్కడ చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంజు తన ప్రేమికుడు నస్రుల్లాతో కలిసి ఓ మైదానంలో తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఉంది. ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు ఆ వీడియో షూట్ చేసిన తీరు చూస్తుంటే.. నిఖా కంటే ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నట్లుగా ఉంది. ఈ వీడియోను చిత్రీకరించిన తీరు చూస్తుంటే.. పక్కా ప్లాన్ తో ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వీడియోను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించారు. వారి వీడియో సినిమాలో ఉండే రొమాంటిక్ సన్నివేశంలా ఉంది. వారిద్దరినీ చూస్తుంటే వీరి ప్రేమపై పూర్తి నమ్మకం ఉందని చెప్పొచ్చు. మరోవైపు అంజు ఆగస్టు 20న ఇండియాకు తిరిగి రానుందని చెబుతున్నారు.
Siri Hanumanthu: బిగ్ బాస్ బ్యూటీ అందాల ఆరబోత.. ఇది మరీ హాట్ గురూ
తన ఫేస్‌బుక్ స్నేహితుడిని కలవడానికి అంజు పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు చేరుకుంది. వాఘా సరిహద్దు గుండా ఆమే పాకిస్థాన్‌లోకి ప్రవేశించింది. ఆ సమయంలో కూడా అంజు ఒక రీల్ చేసింది. అందులో ఆమె పాకిస్తాన్‌లోకి ఎలా ప్రవేశించిందో చెప్పింది. తాను చట్టబద్ధంగానే పాకిస్థాన్‌కు వచ్చానని అంజు తెలిపింది. ఒకట్రెండు రోజులు కాదు, పూర్తి ప్లానింగ్‌తో పాకిస్థాన్‌కు వచ్చినట్లు పేర్కొంది. తనకు ఫేస్‌బుక్‌లో నస్రుల్లాతో స్నేహం ఏర్పడిందని, అతడిని కలిసేందుకు పాకిస్థాన్‌కు వచ్చానని చెప్పింది. మరోవైపు అంజు వీసా గడువు ఆగస్టు 20తో ముగియనుందని.. తిరిగి ఇండియాకు రావాల్సి ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా అంజు కోసం నస్రుల్లా ఇండియాకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు.
A pretty girl #Anju from #india in #pakistan…Says she is in love with #KhyberPukhtunkhwa and its culture… she's going back on 20th August…. pic.twitter.com/sx6JFqTmkB
— Sumaira Khan (@sumrkhan1) July 25, 2023