భూమిపై నివసించిన అత్యంత బరువైన జంతువును ఒకదాన్ని పెరువియన్ ఎడారిలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది 340 టన్నుల బరువు ఉంటుందని తెలుపుతున్నారు. సముద్రంలో ఉండే నీలి తిమింగళం కంటే మూడు రెట్లు ఎక్కువ బరువును కలిగి ఉండాలి. అయితే శాస్త్రవేత్తలు కనుగొన్న జంతువు 39 మిలియన్ సంవత్సరాల కాలం నాటిదని చెబుతున్నారు. ఈ జంతువును పెరువియన్ ఎడారిలో లభించిన అవశేషాల ఆధారంగా గుర్తించారు. పెరువియన్ ఎడారిలో లభించిన జంతువు గురించి జర్మనీకి చెందిన స్టేట్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ స్టట్‌గార్ట్‌లోని పరిశోధకుడు డాక్టర్ ఎలి ఎమ్సన్ సమాచారం ఇచ్చారు. ఆ జంతువుపై పరిశోధన చేసిన సమయంలో మొత్తం 18 ఎముకలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. తిమింగళం రకానికి చెందిన మొట్టమొదటిదని.. దీనిని బాసిలోసౌరిడ్ అని పిలుస్తారని చెప్పారు.
Tamannaah Bhatia: భోళా శంకర్, వేదాళం రీమేకే కానీ అంతా మార్చేశారు.. అసలు విషయం చెప్పేసిన తమన్నా
జంతువుకు సంబంధించిన 18 ఎముకలలో 13 వెన్నుపూస (వెన్నుపాము భాగం), నాలుగు పక్కటెముకలు, తుంటి ఎముక, 17 నుండి 20 మీటర్లు (55.8 నుండి 65.6 అడుగులు) పొడవు ఉన్నాయని డాక్టర్ ఎలి ఎమ్సన్ చెప్పారు. పెరుసెటస్ నీలి తిమింగలం కంటే రెండు నుండి మూడు రెట్లు ఎక్కువ బరువు కలిగి ఉండవచ్చని పేర్కొన్నారు. బ్రస్సెల్స్‌లోని రాయల్ బెల్జియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురల్ సైన్సెస్‌కు చెందిన డాక్టర్ రెబెక్కా బెన్నియన్ మాట్లాడుతూ.. ఒక్కో వెన్నుపూస బరువు దాదాపు 100 కిలోల కంటే ఎక్కువగా ఉంటుందన్నారు. జంతువు పక్కటెముకల పొడవు 1.4 మీటర్లు ఉంటుందని.. ఇప్పటివరకు తెలిసిన అత్యంత బరువైన జంతువుల్లో ఇదేనని అతను చెప్పాడు.
Cucumber Cultivation: దోస పంటలో అధిక దిగుబడి పొందాలంటే ఇలా చెయ్యాల్సిందే..
మరోవైపు శాస్త్రవేత్తలు పెరుసెటస్ పాక్షిక అస్థిపంజరాల ఆధారంగా తిమింగలం పరిమాణం, బరువును అంచనా వేస్తున్నారు. పెరుసెటస్ రెండు నీలి తిమింగలాలు, మూడు అర్జెంటీనోసార్‌లు (ఒక పెద్ద సౌరోపాడ్ డైనోసార్), 30 కంటే ఎక్కువ ఆఫ్రికన్ అడవి ఏనుగులు, 5,000 కంటే ఎక్కువ మంది వ్యక్తుల బరువుతో సమానంగా ఉండేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. మరోవైపు ఈ జంతువును 13 సంవత్సరాల క్రితం పెరువియన్ పాలియోంటాలజిస్టులు కనుగొన్నారు.